మేషం : ఈ రాశివారు అనవసర భయాందోళనలకు లోనవుతారు. అసత్యానికి దూరంగా ఉండటం మంచిది. నూతనకార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. వృషభం : ఈ రాశివారికి ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. స్వల్ప అనారోగ్యబాధలు ఉంటాయి. వృధాప్రయాణాలు చేస్తారు. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. మిథునం : ఈ రాశివారికి అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. కర్కాటకం : ఈ […]

మేషం : ఈ రాశివారు అనవసర భయాందోళనలకు లోనవుతారు. అసత్యానికి దూరంగా ఉండటం మంచిది. నూతనకార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు.

వృషభం : ఈ రాశివారికి ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. స్వల్ప అనారోగ్యబాధలు ఉంటాయి. వృధాప్రయాణాలు చేస్తారు. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది.

మిథునం : ఈ రాశివారికి అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది.

కర్కాటకం : ఈ రాశివారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టంపట్ల జాగ్రత్త వహించడం మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు.

సింహం : ఈ రాశివారికి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. విందులు, వినోదాల‌కు దూరంగా ఉండ‌టం మంచిది.

కన్య : ఈ రాశివారికి వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలున్నాయి. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం.

తుల : ఈ రాశివారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టపోయే అవకాశం ఉంది. ఆకస్మిక ధననష్టం పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం.

వృశ్చికం : ఈ రాశివారు వృత్తి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.

ధనుస్సు : ఈ రాశివారు శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు.

మకరం : ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు.

కుంభం : ఈ రాశివారు అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు.

మీనం : ఈ రాశివారికి ప్రయత్నకార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. రుణబాధలు తొలగిపోతాయి. ధైర్యసాహసాలతో ముందుకు వెళ్తారు.

Updated On 8 Jan 2023 7:12 AM GMT
subbareddy

subbareddy

Next Story