Thursday, March 23, 2023
More
  Homelatest10-03-2023 శుక్రవారం రాశి ఫలాలు.. వీరికి కీర్తి, ప్ర‌తిష్ఠ‌లు పెరుగుతాయి..

  10-03-2023 శుక్రవారం రాశి ఫలాలు.. వీరికి కీర్తి, ప్ర‌తిష్ఠ‌లు పెరుగుతాయి..

  మేష రాశి : సంఘంలో గుర్తింపు లభిస్తుంది. గృహంలోకి నూతన వస్తువులను  సంగ్రహిస్తారు. దూరప్రాంతాల నుండి శుభ సమాచారాన్ని అందుకుంటారు. శత్రువులతో వివాదాలను పరిష్కరించుకుంటారు.

  వృషభ రాశి : అపార్థాలు తొలగిపోతాయి. పెద్దల ఆదరణతో కార్యసిద్ధి కలుగుతుంది. ప్రణాళికలు సత్ఫలితాలనిస్తాయి. వివాహప్రయత్నాలు సిద్ధిస్తాయి. ధనప్రాప్తి కలుగుతుంది. నిద్రా సౌఖ్యం తక్కువ.

  మిథున రాశి : పరులను బాధపెట్టే పనులకు దూరంగా వుండండి. స్థిరాస్థి మూలక అశాంతి కలుగవచ్చును. శరీరమందు జ్వరాది బాధలు కలుగవచ్చును. సోమరితనము వలన కార్యవిలంబములుంటాయి.

  కర్కాటక రాశి : క్రీడాకారులకు శ్రమతో కూడిన విజయాలు కలుగుతాయి.  ఖర్చుల విషయంలో ఆలోచనలు చేస్తారు. భూ, గృహ ప్రయత్నములు ఫలిస్తాయి. సంభాషణలు సత్ఫలతాన్నిస్తాయి.

  సింహ రాశి : అకాల భోజనము కలుగుతుంది. భాగస్వాములతో మాట పట్టింపులు రావచ్చును. కార్యనిర్వహణలో భయం ఆవహిస్తుంది. చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడవలసి వస్తుంది.

  కన్యా రాశి : విద్యార్థులు సమస్యలను అధిగమిస్తారు. పెద్దల ఆదరణ లభిస్తుంది. నిద్రా సౌఖ్యము లభిస్తుంది. శత్రు బాధలు తొలగిపోతాయి. రోజంతా ఆనందోత్సాహాలతో గడుపుతారు.

  తులా రాశి : ప్రయాణముల మూలకంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ బాధ్యతలను ఇతరులకు అప్పగిస్తారు. అకస్మాత్తు సంఘటనలు ఇబ్బంది పెడతాయి. సోదరుల మూలక అశాంతి కలుగవచ్చును.

  వృశ్చిక రాశి : వివాహప్రయత్నాలు ఫలిస్తాయి. కవులు, కళాకారులకు గౌరవమర్యాదలు లభిస్తాయి. లోతైన విశ్లేషణ‌లు చేస్తారు. నూతన వస్త్ర ప్రాప్తి కలుగుతుంది. భోజన సౌఖ్యం లభిస్తుంది.

  ధనుస్సు రాశి : క్రీడాకారులు అద్భుతంగా రాణిస్తారు. నూతన పెట్టు బడులు సంతోషాన్నిస్తాయి. సోదరులతో సఖ్యత లాభిస్తుంది. ప్రయాణములు చేయవలసి వస్తుంది. ధనప్రాప్తి సంతోషాన్నిస్తుంది.

  మకర రాశి : గృహములకు అశాంతి కలుగుతుంది. తలనొప్పి మొదలైన శరీర బాధలు కలుగవచ్చును. అధికారుల మూలక అశాంతి కలుగుతుంది. శ్రమ ఎక్కువగా వుంటుంది. అనవసర వ్యయములు చేస్తారు.

  కుంభ రాశి : అజీర్ణ బాధలతో శరీర బలహీనతలుంటాయి. ఇష్టము లేని వ్యక్తులను కలుసుకుంటారు. అధిక నిద్రవలన సోమరితనం కలుగుతుంది. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా వుంటాయి.

  మీన రాశి : అకస్మాత్తుగా ధనప్రాప్తి కలుగుతుంది. కార్యసిద్ధికై కఠినంగా మాట్లాడవలసి వస్తుంది. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది శుభకార్యాలలో పాల్గొంటారు. కీర్తి, ప్రతిష్టలు కలుగుతాయి.

  – తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి,
  కూకట్‌పల్లి, హైదరాబాద్
  ఫోన్‌ నంబర్‌ : +91 99490 11332.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular