మేష రాశి : ఉద్యోగ రీత్యా ప్రయాణములు చేయుదురు. అధికారులు మిమ్ములను అపార్థం చేసుకొను అవకాశములు కనిపిస్తున్నది. చిన్న పనులైనను ఎక్కువ శ్ర‌మించాల్సి వస్తుంది. కొన్ని వస్తు నష్టములు కలుగవచ్చును. వృషభ రాశి : అజీర్ణ‌ సబంధమైన బాధలు కలుగవచ్చును. అనుకోని చిక్కుల మూలకంగా అశాంతి ఏర్పడుతుంది. ధన వ్యయము పెరుగుతుంది. ఇతరుల సహాయమును కోరవలసి వస్తుంది. మిథున రాశి : కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. ఆక‌స్మిక ధనలాభాము గోచరిస్తుంది. పట్టుద‌లను ప్రదర్శిస్తారు. […]

మేష రాశి : ఉద్యోగ రీత్యా ప్రయాణములు చేయుదురు. అధికారులు మిమ్ములను అపార్థం చేసుకొను అవకాశములు కనిపిస్తున్నది. చిన్న పనులైనను ఎక్కువ శ్ర‌మించాల్సి వస్తుంది. కొన్ని వస్తు నష్టములు కలుగవచ్చును.

వృషభ రాశి : అజీర్ణ‌ సబంధమైన బాధలు కలుగవచ్చును. అనుకోని చిక్కుల మూలకంగా అశాంతి ఏర్పడుతుంది. ధన వ్యయము పెరుగుతుంది. ఇతరుల సహాయమును కోరవలసి వస్తుంది.

మిథున రాశి : కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. ఆక‌స్మిక ధనలాభాము గోచరిస్తుంది. పట్టుద‌లను ప్రదర్శిస్తారు. గౌరవము పెరుగుతుంది. విందు, వినోదాలలో పాల్గొంటారు.

కర్కాటక రాశి : మీ నైపుణ్యతకు గుర్తింపు లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. దాన ధర్మాది కార్యములు సంతోషాన్నిస్తాయి. దైవకార్యాలలో పాల్గొంటారు. బకాయి పడ్డ‌ డబ్బులు చేతికందుతాయి.

సింహ రాశి : వివాహ ప్రయత్నాలు ముందుకు సాగక‌పోవడం చికాకు కలిగిస్తుంది. వృథా సంచారము వలన సమయం వృథా అవుతుంది. సొమరితనము వలన ఇబ్బంది పడతారు. వృథా ధన వ్యయము కలుగవచ్చును.

కన్యా రాశి : ప్రభుత్వాధికారులకు అనుకూలమైన రోజు. బంధుమిత్రులతో ఆనందంగా గడువుతారు. శత్రువులతో వివాదాలు పరిష్కారమౌతాయి. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ధనలాభము కలుగుతుంది.

తులా రాశి : సోదర వర్గ సహకారం లభిస్తుంది. వాక్పటిమ, ఆత్మస్థైర్యముతో పనులు పూర్తిచేస్తారు. ఇష్టమైన వ్యక్తుల కలయిక ఉల్లాసాన్నిస్తుంది. కోర్టు వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

18-03-2023 శ‌నివారం రాశి ఫ‌లాలు.. ఈ రాశి వారికి స్థిరాస్తి వ్యవహారాలు లాభిస్తాయి

వృశ్చిక రాశి : శరీర బాధలు కలుగవచ్చును. ప్రయాణముల వలన ఇబ్బంది ఎదుర్కొంటారు. గతంలో చేసిన పొరపాట్లు బాధిస్తాయి. నిందావాక్య‌ములన‌ వినవలసివ‌స్తుంది. ధన వ్యయము కలుగవచ్చును.

ధ‌నస్సు రాశి : కుటుంబ సభ్యులకు అండగా నిలబడతారు. పరోపకారము సంతోషాన్నిస్తుంది. పెద్దలతో గౌరవంగా నడుచుకుంటారు. ధనలాభము కలుగుతుంది. కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు.

మకర రాశి : స్థిరాస్థి వ్యవహారాలు అశాంతి కలిగిస్తాయి. విదేశీ ప్రయణయత్నాలకు ఆటంకం కలుగవచ్చును. అనుకొని ప్రమాదముల మూలకంగా అశాంతి కలుగుతుంది. తగిన గౌరవము రాకపోవడం వలన మనః సౌఖ్యము ఉండక పోవచ్చును.

కుంభ రాశి : విద్యావంతులు, మేధావులకు గౌరవ మర్యాదనలు లభిస్తాయి. శుభాకార్యములను ఆచరిస్తారు. సంతాన మూలకంగా ఆనందాన్ని పొందుతారు. రోజంతా మనోల్లాసంగా గడుస్తుంది.

మీన రాశి : మోసపోయే ప్రమాదం నుండి బయటపడుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. బంధుమిత్రుల ఆద‌రణ లభిస్తుంది. అనుకున్న పనులను పూర్తిచేస్తారు. మనోభీష్టములు నెరవేరుతాయి.

- తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి,
కూకట్‌పల్లి, హైదరాబాద్
ఫోన్‌ నంబర్‌ : +91 99490 11332.

12-03-2023 నుండి 18-03-2023 వ‌ర‌కు వార రాశి ఫ‌లాలు

Updated On 18 March 2023 3:32 AM GMT
Somu

Somu

Next Story