మేష రాశి: ఆలోచనలు పక్కదారి ప‌ట్టే అవకాశ‌ముంది. బంధుమిత్రులతో విభేదాలు క‌లుగుతాయి. ఉద్రేక‌ము వలన పనులు ఆగిపోతాయి. వాక్యాఠిన్య‌ము వలన ఇబ్బంది ప‌డ‌తారు. వృషభ రాశి: వాక్చాతుర్య‌ముతో పనులను పూర్తి చేసుకుంటారు. పెద్దల ఆదరణ ల‌భిస్తుంది. మ‌నో ధైర్య‌ముతో శతృవులను జ‌యిస్తారు. నూతన ఆలోచనలతో వ్యాపారస్థులు రాణిస్తారు. ధన ధాన్య లాభ‌ములు కలుగుతాయి. మిథున రాశి: గతంలో చేసిన పొరపాట్లు బాధిస్తాయి. నిందావాక్య‌ములను వినవలసి వస్తుంది. ఔషధ సేవనము చేయవలసి వస్తుంది. భోజ‌న సౌక్య‌ము వుండ‌క‌పోవ‌చ్చును. కర్కాటక […]

మేష రాశి: ఆలోచనలు పక్కదారి ప‌ట్టే అవకాశ‌ముంది. బంధుమిత్రులతో విభేదాలు క‌లుగుతాయి. ఉద్రేక‌ము వలన పనులు ఆగిపోతాయి. వాక్యాఠిన్య‌ము వలన ఇబ్బంది ప‌డ‌తారు.

వృషభ రాశి: వాక్చాతుర్య‌ముతో పనులను పూర్తి చేసుకుంటారు. పెద్దల ఆదరణ ల‌భిస్తుంది. మ‌నో ధైర్య‌ముతో శతృవులను జ‌యిస్తారు. నూతన ఆలోచనలతో వ్యాపారస్థులు రాణిస్తారు. ధన ధాన్య లాభ‌ములు కలుగుతాయి.

మిథున రాశి: గతంలో చేసిన పొరపాట్లు బాధిస్తాయి. నిందావాక్య‌ములను వినవలసి వస్తుంది. ఔషధ సేవనము చేయవలసి వస్తుంది. భోజ‌న సౌక్య‌ము వుండ‌క‌పోవ‌చ్చును.

కర్కాటక రాశి: దూర ప్రాంతాల నుండి శుభవార్తలను వింటారు. భూ, గృహలాభము క‌లుగుతాయి. శరీర బాధలు ఉపశమిస్తాయి. అధికారుల ఆద‌ర‌ణ‌ లభిస్తుంది. ధనప్రాప్తి కలుగుతుంది.

సింహ రాశి: సోమరితనం వల్ల ఇబ్బందుల నెదుర్కొంటారు. ఖర్చులు పెరుగుతాయి. ప్రయత్న కార్యములను మధ్యలోనే వదిలిస్తారు. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసివస్తుంది. ఋణమూల‌క అశాంతి కలుగచ్చును.

కన్యా రాశి: నూతన శుభారంభములు చేస్తారు. ఇంట్లో శుభాకార్య‌మూల‌క సంప్రదింపులు జరుపుతాయి. నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. సర్వత్రా అనుకూలతలు క‌లుగుతాయి.

తులా రాశి: ప్రయత్న కార్యములు పూర్త‌వుతాయి. బంధుమిత్రులతో కలయికలు సంతోషాన్ని కలిగిస్తాయి. ఋణ‌ ప్రయత్నాలు ఫలిస్తాయి. తొందరపాటు పనికిరాదు. దైవిక‌ కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చిక రాశి: ఋణ బాధలు తీరుతాయి. సాహసముతో పనులను పూర్తి చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో కీర్తి లభిస్తుంది. మిత్రుల సహకారం అందుతుంది. ధనధాన్య సమృద్ధి కలుగుతుంది.

ధనుస్సు రాశి: శరీర బాధలతో అశాంతి కలుగుతుంది. సంతాన మూలక సౌఖ్యం లభిస్తుంది. అధికారములలో వృద్ధి వుంటుంది. మిత్ర వాత్స‌ల్య‌ము సంతోషాన్నిస్తుంది. అనుకొని ధన లాభం కలుగుతుంది.

మకర రాశి: శుభకార్యాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం ఉల్లాసాన్నిస్తుంది. భోజన సౌఖ్యము లభిస్తుంది. పట్టుదలతో పనులు పూర్తవుతాయి. ధన ప్రాప్తి కలుగుతుంది.

కుంభ రాశి: ఉద్యోగులు మీ స్థానాన్ని తిరిగి పొందుతారు. శుభవార్తాశ్ర‌వణ‌ం కలుగుతుంది. ఆరోగ్యం మెరుగు పడుతుంది. దానధర్మాది పుణ్యకార్యాచరణము కలుగుతుంది. రావలసిన ధనం చేతి కందుతుంది.

మీన రాశి: వాత సంబంధమైన శరీర బాధలు కలుగవచ్చును. విలువైన వస్తువులను నష్టపోతారు. అపవాదులు మనశ్శాంతిని దూరం చేస్తాయి. వృధా ధన వ్యయము కలుగుతుంది. ఉద్రేకాన్ని తగ్గించుకోండి.

తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి,
కూకట్‌పల్లి, హైదరాబాద్
ఫోన్‌ నంబర్‌ : +91 99490 11332.

Updated On 4 March 2023 2:21 AM GMT
Somu

Somu

Next Story