UP విధాత: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఘోరం జరిగింది. ఓ జువైనల్ హోమ్‌లోని బాలికలను సూపరింటెం డెంట్ తీవ్ర చిత్రహింసలకు గురి చేశారు. మంచానికి కట్టేసి, చెప్పుతో చితకబాదారు. ఆ దెబ్బలకు చిన్నారులు తల్లడిల్లిపోయారు. సూపరింటెండెంట్ వేధింపులు తాళలేక కొద్ది రోజుల క్రితం ఓ చిన్నారి ఆత్మహత్యాయత్నం చేసింది. చిన్నారులను చితకబాదిన సూపరింటెండెంట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో సూపరింటెండెంట్ పూనమ్ పాల్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు […]

UP
విధాత: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఘోరం జరిగింది. ఓ జువైనల్ హోమ్‌లోని బాలికలను సూపరింటెం డెంట్ తీవ్ర చిత్రహింసలకు గురి చేశారు. మంచానికి కట్టేసి, చెప్పుతో చితకబాదారు. ఆ దెబ్బలకు చిన్నారులు తల్లడిల్లిపోయారు.
సూపరింటెండెంట్ వేధింపులు తాళలేక కొద్ది రోజుల క్రితం ఓ చిన్నారి ఆత్మహత్యాయత్నం చేసింది. చిన్నారులను చితకబాదిన సూపరింటెండెంట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో సూపరింటెండెంట్ పూనమ్ పాల్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సోమవారం రోజు ఓ అమ్మాయిని మంచానికి కట్టేసి హింసించింది. మరో ఆరుగురు అమ్మాయిలను మూడు మంచాలపై ఉంచి, తీవ్రంగా కొట్టింది. పూనమ్ పాల్ చిన్నారులను కొడుతుంటే.. మరో ఉద్యోగిని చూస్తూ ఉండిపోయింది. మంగళవారం రోజు కూడా ఓ అమ్మాయిని మంచానికి కట్టేశారు. అమ్మాయి తాళ్లను తీసేసేందుకు ప్రయత్నించింది.
ఈ ఘటనపై ఆగ్రా డివిజన్ కమిషనర్ రితూ మహేశ్వరి స్పందించారు. జువైనల్ హోమ్ సూపరింటెండెంట్‌తో పాటు ఇతర సిబ్బందిని కూడా సస్పెండ్ చేశామన్నారు. జిల్లా మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారని తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
