Friday, December 9, 2022
More
    Homelatestఫుడ్ విషయంలో ఘర్షణ.. కస్టమర్ పై వేడి నూనె పోసిన యజమాని

    ఫుడ్ విషయంలో ఘర్షణ.. కస్టమర్ పై వేడి నూనె పోసిన యజమాని

    Odisha | విధాత: చాలా మంది హోటల్స్ లో తినేవారు.. తక్కువ ధరకే రుచికరమైన భోజనం లభించాలని కోరుకుంటారు. కొందరైతే పైసలు పోయినా పర్వాలేదు అనుకొని మంచి హోటల్స్ కు వెళ్లి రుచికరమైన భోజనాన్ని తింటారు.

     

    అయితే ఈ హోటల్ లో భోజనం రుచికరంగా లేదు. పైగా పైసలు కూడా ఎక్కువే అని కస్టమర్ వాదించాడు. కోపంతో ఊగిపోయిన హోటల్ యజమాని వేడి వేడి నూనె అతని మీద పోసేశాడు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని జాజ్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.

     

    కటక్ కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలిచంద్రాపూర్ గ్రామానికి చెందిన ప్రశాన్ జిత్ పరిడా(48) అనే వ్యక్తి.. స్థానిక మార్కెట్ లో ఉన్న ఓ హోటల్ లో భోజనం చేసేందుకు వెళ్లాడు. సర్వర్ పరిడా టేబుల్ వద్దకు భోజనం తీసుకురాగా పరిడా భోజనం చేస్తూనే రుచి లేదని కోపోద్రిక్తులయ్యాడు.

    రుచి లేని భోజనానికి ఖరీదు ఎక్కువ ఎందుకని ఆ హోటల్ యజమానితో పరిడా గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన యజమాని.. పరిడాపై వేడి వేడి నూనె పోయడంతో ముఖం, మెడ, ఛాతీ, కడుపు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.

    వెంటనే తన్ని కటక్ లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీలో చేర్పించగా వైద్యులు పరిడాకు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular

    You cannot copy content of this page