ఉన్నమాట: మునుగోడు ఓటరు మనోగతాన్ని దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఫలితాలతో పోల్చి చూడలేం. ఎందుకంటే మొదటి నుంచి ఆ స్థానం కమ్యూనిస్టుల కంచుకోట అయితే తర్వాత అది కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళింది. తర్వాత టీఆర్‌ఎస్‌కు జై కొట్టారు. ఎప్పుడూ అధికారంలో ఒక పార్టీ ఉంటే ప్రతి పక్ష అభ్యర్థికి పట్టం కట్టే ఆనవాయితీ కూడా ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. పైన పేర్కొన్నట్లు కమ్యూనిస్టుల […]

ఉన్నమాట: మునుగోడు ఓటరు మనోగతాన్ని దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఫలితాలతో పోల్చి చూడలేం. ఎందుకంటే మొదటి నుంచి ఆ స్థానం కమ్యూనిస్టుల కంచుకోట అయితే తర్వాత అది కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళింది. తర్వాత టీఆర్‌ఎస్‌కు జై కొట్టారు. ఎప్పుడూ అధికారంలో ఒక పార్టీ ఉంటే ప్రతి పక్ష అభ్యర్థికి పట్టం కట్టే ఆనవాయితీ కూడా ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది.

పైన పేర్కొన్నట్లు కమ్యూనిస్టుల నుంచి ఓటర్లు కాంగ్రెస్‌కు జై కొట్టినట్టు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బీజేపీకి ఓటర్లు మారుతారా? అంటే అంత ఈజీ కాదన్నది అక్కడి పరిణామాలను చూస్తే అర్థం అవుతున్నది. హైదరాబాద్ మహా నగరానికి అనుకుని ఉన్న ఆ నియోజవర్గంలోని చౌటుప్పల్ మండలంలో ఇప్పటికీ వామపక్షాల ప్రభావం ఉన్నది. ఆ చైత్యన్యం అక్కడి యువతలో కొంత ఉండటం, వాళ్ళు విద్వేష రాజకీయాలను వ్యతిరేకిస్తున్నారు.

అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ నియోజవర్గం అక్కడి ప్రజలు ఆశించినంత అభివృద్ధి జరగకున్నా అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది అని అక్కడి ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. అలాగే శాంతి భద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, సంక్షేమ పథకాల అమలు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ఫ్లోరైడ్ నివారణ కోసం, అందరికీ తాగునీటి కోసం తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన మిషన్ భగీరథ పంపులు ప్రతి ఇంటి ముందు కనిపిస్తున్నాయి. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొనే గతం కంటే ప్రస్తుతం మెరుగే అంటున్నారు. ఇంకో విషయం ఏమిటంటే మండల కేంద్రం నుంచి ఇంకో మండలానికి వెళ్ళే రోడ్లు విశాలంగా ఉన్నాయి.

అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా నియోజవర్గ అభివృద్ధికి నిధులు వస్తాయి. వాటికి వినియోగించి వృద్ధి చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకుంటే చట్ట సభల్లో నిల దీయవచ్చు.. ప్రభుత్వ వివక్షను ప్రశ్నించవచ్చు.

కానీ ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిన అభ్యర్థి ఏనాడూ ఆ పని చేయలేదని అధికార పార్టీ నేతల వాదనను నియోజవర్గ ప్రజలు అంగీకరిస్తున్నారు. అంతేకాదు ఎంపీగా, ఎమ్మెల్సీగా, మూడున్నర ఏళ్లు ఎమ్మెల్యేగా ఏమీ చేయలేని వ్యక్తి ఇప్పుడు ఏడాది పదవీ కాలం ఏం చేస్తాడు?.

కేంద్రం నుంచి నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులు తేగలడు అని ప్రజలు కూడా ప్రశ్నిస్తుండటం గమనార్హం. బీజేపీ బల ప్రదర్శనకు, భావోద్వేగాలకు మునుగోడును ప్రయోగశాలగా మార్చిన బీజేపీ ప్రయత్నాన్ని ప్రజలు హర్షించడం లేదు. ఆమోదించడానికి సిద్ధంగా లేరు. _ ఆసరి రాజు

Updated On 1 Nov 2022 7:40 AM GMT
krs

krs

Next Story