Friday, December 9, 2022
More
  HomelatestTelangana: డ్రగ్ కింగ్‌పిన్ ఎడ్విన్‌కు బెయిల్ ఎలా వచ్చింది?

  Telangana: డ్రగ్ కింగ్‌పిన్ ఎడ్విన్‌కు బెయిల్ ఎలా వచ్చింది?

  విధాత: దేశంలోనే డ్ర‌గ్ స‌ర‌ఫ‌రాలో ప్ర‌సిద్ధి చెందిన టాప్ 3లో ఒక‌రు ఎడ్విన్‌. ఒక‌వైపు తెలంగాణ ప్ర‌భుత్వం డ్ర‌గ్స్ కేసును సీరియ‌స్‌గా తీసుకుంది. మరోవైపు పోలీసులు ప‌క్కా ఆధారాల‌తోనే ఎడ్విన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇలాంటి మోస్ట్ వాంటెడ్ డ్ర‌గ్ కింగ్ పిన్‌కు గురువారం నాడు నాంప‌ల్లి కోర్టు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ వ‌చ్చింది.

  నిజానికి ఎడ్విన్ నున్స్ డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాలోనే కాదు, గోవాలో ఒక మ‌హిళా బిజేపీ నేత‌ హ‌త్య కేసులో కూడా నిందితుడు. ఈ కేసులో గోవా పోలీసులు ఎడ్విన్‌ను అరెస్టు చేశారు. గోవాకు చెందిన డ్రగ్ సరఫరాదారు ఎడ్విన్ నూన్స్‌కు బెయిల్ ఇవ్వ‌కూడ‌ద‌ని అత‌న్ని కోర్టులో ప్ర‌వేశ‌పెట్టిన లాలాగూడ పోలీసులు వాదించ‌ లేద‌ని చెబుతున్నారు.

  దీంతో నాంప‌ల్లి కోర్టు 30 రోజుల పాటు ప్రతి రోజూ పోలీసుల ఎదుట హాజ‌రు కావాల‌న్న ష‌ర‌తుతో బెయిల్ ఇచ్చింది. దీంతో డ్ర‌గ్ కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎడ్విన్ న‌వ్వుకుంటూ జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు.

  ఇక ఇలాంటి కేసులోనే ఎడ్విన్‌పై కేసు న‌మోదు చేసిన లాలాగూడ పోలీసులు సైతం ఎడ్విన్‌కు బెయిల్ ఇవ్వ‌రాద‌ని కోర్టులో వాదించ‌లేక‌పోయారు. దీంతో ఎడ్విన్ గ‌తంలో అత‌నిపై హైద‌రాబాద్‌లో రెండు చోట్ల న‌మోదైన కేసుల్లో సైతం బెయిల్ పొందాడు. రాంగోపాల్‌పేట పోలీసులు న‌మోదు చేసిన కేసులో సైతం ఎడ్విన్ సునాయాసంగా బెయిల్ పొందాడు.

  ఎడ్విన్ డైరీలో రాజ‌కీయ ప్ర‌ముఖుల పేర్లు, వారికి సైతం డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు ఆధారాలు ఉండ‌టంతోనే పోలీసులు ఎడ్విన్ కేసులో నిస్స‌హాయులుగా మారిపోయారా అనే అనుమానాల‌ను ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.

  అటు గోవాలో అధికార పార్టీ బిజేపీ నాయ‌కుల‌కు కూడా ఎడ్విన్ బాగా ద‌గ్గ‌ర‌ వాడ‌ని, ఇటు తెలంగాణ‌లో సైతం ముఖ్య నాయ‌కుల బండారం బ‌య‌ట‌ ప‌డుతుంద‌నే ఉద్దేశంతో డ్ర‌గ్స్ కేసు విచార‌ణ ప‌క్క‌దారి ప‌ట్టించేలా పోలీసుల‌పై ఒత్తిళ్లు వ‌చ్చాయ‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page