ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుత వయసు 73 ఏళ్లు. ఈ వయసులో కూడా ఆయన హుషారు తగ్గకుండా యంగ్ హీరోల మాదిరిగా వరుస చిత్రాలు చేస్తున్నారు. ఒకప్పటి కంటే ఇప్పుడు సినిమాల వేగం పెంచారు. సాధారణంగా 73 ఏళ్ల వయసు అంటే ఎవరైనా కాటికి కాళ్లు జాపుకుని ఉన్నామని భావిస్తారు. కానీ రజనీ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఈయన చివరిసారిగా పెద్దన్న సినిమాతో వచ్చారు. ప్రస్తుతం జైలర్ అనే సినిమాను పాన్ ఇండియా […]

ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుత వయసు 73 ఏళ్లు. ఈ వయసులో కూడా ఆయన హుషారు తగ్గకుండా యంగ్ హీరోల మాదిరిగా వరుస చిత్రాలు చేస్తున్నారు. ఒకప్పటి కంటే ఇప్పుడు సినిమాల వేగం పెంచారు. సాధారణంగా 73 ఏళ్ల వయసు అంటే ఎవరైనా కాటికి కాళ్లు జాపుకుని ఉన్నామని భావిస్తారు. కానీ రజనీ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.

ఈయన చివరిసారిగా పెద్దన్న సినిమాతో వచ్చారు. ప్రస్తుతం జైలర్ అనే సినిమాను పాన్ ఇండియా చిత్రంగా చేస్తున్నారు. దీనికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతూ ఉండడంతో కేవలం త‌మిళ న‌టీన‌టుల‌నే కాకుండా దక్షిణాదితో పాటు బాలీవుడ్కు చెందిన స్టార్ లను సైతం ఈ చిత్రంలో భాగస్వామ్యం చేస్తున్నారు.

తాజాగా ర‌జ‌నీకాంత్ త‌న ఆరోగ్యానికి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని పంచుకున్నారు. ఇంత‌కీ రజినీకాంత్ పంచుకున్న ఆ ఆస‌క్తిర విష‌యం ఏమిటంటే త‌న భార్య ల‌త గురించి. ఆమె త‌న‌పై, త‌న ఆరోగ్యంపై పెట్టిన శ్ర‌ద్ద గురించి. ఆయ‌న మాట్లాడుతూ, 73 ఏళ్ల వయసులో కూడా నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే దానికి కారణం నా భార్య లత. నేను మద్యం,నాన్ వెజ్,సిగరెట్ కి బాగా ఎడిక్ట్ అయిన సమయంలో నా హెల్త్ కండిషన్ చూసి డాక్టర్లు రెండు నెలల కంటే ఎక్కువ బతకలేవని చెప్పేశారు.

అయితే ఆ సమయంలో నా భార్య లత తన ప్రేమతో నా అలవాట్లు అన్ని మానుకునేలా చేసింది. అలాగే నన్ను మళ్ళీ పూర్తి ఆరోగ్యవంతుడిగా మార్చింది. ఈరోజు నేను మీ ముందు ఇలా ఉన్నాను అంటే దానికి సంబంధించిన పూర్తి క్రెడిట్ నా భార్యకే ఇస్తాను అని పేర్కొన్నారు. రజిని మాటలు ప్రస్తుతం కోలీవుడ్ లో సంచలనంగా మారాయి.

రెండేళ్ల కిందట రజని రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నారు. సొంత రాజ‌కీయ పార్టీ పెట్టాలని భావించారు. అయితే తన అనారోగ్య కారణాలు, ఇతర రాజకీయ పరిస్థితుల కారణంగా కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు రాజకీయాలకు దూరంగా ఉండాలని రజనీ నిర్ణయించుకున్నారు. మొత్తానికి రజినీ ఆరోగ్యం, కెరీర్ విషయాల‌లో ఆయన కుటుంబ సభ్యుల కృషి ఎంతో ఉందని చెప్పాలి.

Updated On 30 Jan 2023 9:01 AM GMT
krs

krs

Next Story