Turmeric Adulteration | మీరు వాడే పసుపు.. కల్తీదో.. స్వచ్ఛమైందో.. తెలుసుకోండిలా..!
Turmeric Adulteration | పసుపు.. ఈ పదార్థం తప్పనిసరిగా ప్రతి ఒక్కరి వంటింట్లో ఉంటుంది. పసుపును పలు వంటకాల్లో వినియోగించడంతో పాటు ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తుంటారు. కొన్ని రోగాలకు ఇది మంచి మెడిసిన్‌లా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తుంటారు. అంతేకాకుండా మనషుల రోగ నిరోధక శక్తిని కూడా పసుపు పెంచుతుంది. ఇక ప్రతి కూరలోనూ పసుపును వాడుతాం. పసుపు ఉపయోగించకుండా ఏ వంట కూడా చేయలేం. మరి అంతటి ప్రాధాన్యమున్న పసుపు.. స్వచ్ఛమైందో.. కల్తీదో తెలుసుకోవాల్సిన […]

Turmeric Adulteration | పసుపు.. ఈ పదార్థం తప్పనిసరిగా ప్రతి ఒక్కరి వంటింట్లో ఉంటుంది. పసుపును పలు వంటకాల్లో వినియోగించడంతో పాటు ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తుంటారు. కొన్ని రోగాలకు ఇది మంచి మెడిసిన్‌లా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తుంటారు. అంతేకాకుండా మనషుల రోగ నిరోధక శక్తిని కూడా పసుపు పెంచుతుంది. ఇక ప్రతి కూరలోనూ పసుపును వాడుతాం. పసుపు ఉపయోగించకుండా ఏ వంట కూడా చేయలేం. మరి అంతటి ప్రాధాన్యమున్న పసుపు.. స్వచ్ఛమైందో.. కల్తీదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
మార్కెట్‌లో పసుపు దొరుకుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో కల్తీ పసుపును అమ్ముతుంటారు. పసుపులో కృత్రిమ రంగులు జోడించడం, మెటానిల్ అనే రసాయనాన్ని కలిపి పసుపు రంగు వచ్చేలా చేయడం, లెడ్ క్రోమేట్లతో కలిపి పసుపు రంగు వచ్చేలా చేసి అమ్మడం వంటివి చేస్తున్నారు. ఈ రసాయనాలు వాడడం వల్ల ఆ పసుపు ఆరోగ్యానికి మంచిదికాదు. అలాగే పసుపు పొడిలో చాక్ పౌడర్‌ను కలిపి లేదా అడవి పసుపును కలిపి కూడా అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి హానికరమైనవే అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మనం ఉపయోగించే పసుపు కల్తీదో కాదో ఇలా తెలుసుకోవచ్చు. ఒక టీ స్పూన్ పసుపు పొడిని నీటిలో కలపాలి. నీటిలో వేసిన పసుపంతా నీటి దిగువకు చేరి, లేత పసుపు రంగులోకి మారితే అది నిజమైన స్వచ్ఛమైన పసుపు అని గ్రహించాలి. అదే కల్తీ పసుపు అయితే.. నీటిలో వేసిన తర్వాత ముదురు పసుపు రంగులోకి మారిపోతుంది. ఇలా పసుపు కల్తీనా.. కాదా అని తెలుసుకోవచ్చు.
మీ అరచేతిలో చిటికెడు పసుపును వేసి బొటనవేలితో గట్టిగా 20 సెకండ్ల పాటు మర్దన చేయండి. ఆ తర్వాత చేతులను దులిపేసుకోండి. మీ చేతిపై పసుపు మరక అలానే ఉంటే అది స్వచ్ఛమైన పసుపు అని అర్థం చేసుకోవాలి. అలాగే ఇంట్లోనే కొన్ని నిమిషాల్లో చేయగలిగే ఒక సాధారణ పరీక్ష కూడా ఉంది. ఒక గాజు కూజాను గోరువెచ్చటి నీటితో నింపండి. అందులో ఒక స్పూన్ పసుపు వేయండి. కాసేపు దాన్ని వదిలేయండి. పసుపు పొడి అడుగుభాగాన చేరితే ఆ పసుపు స్వచ్ఛమైనదని అర్థం. అలా కాకుండా పసుపు నీటిలో కలిసిపోయి ముదురు పసుపు రంగులో మారితే అది కల్తీ పసుపు అని అర్థం.
