విధాత‌: జ‌రిగిన త‌ప్పును ఒప్పుకోవడం పశ్చాత్తాప పడటం అంతకు మించింది ఇంకేమీ లేదు. అలా మారు మనస్సు పొందిన వ్యక్తి రాజమౌళి. జరిగిన పొరపాట్లకు పశ్చాతాపం వ్యక్తం చేయడంతో అక్కడితో వివాదానికి పుల్ స్టాప్ పెట్టినట్టు అవుతుంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి అలాంటి ఒక సన్నివేశం ఎదురైంది. సాధారణంగా వివాదాలకు దూరంగా తాను మాట్లాడే మాటలను ఎంతో ఆచితూచి మాట్లాడే రాజమౌళి స్టార్ హీరో విషయంలో తన తప్పును అంగీకరించారు. 15 ఏళ్ల కిందట ఎస్ఎస్ […]

విధాత‌: జ‌రిగిన త‌ప్పును ఒప్పుకోవడం పశ్చాత్తాప పడటం అంతకు మించింది ఇంకేమీ లేదు. అలా మారు మనస్సు పొందిన వ్యక్తి రాజమౌళి. జరిగిన పొరపాట్లకు పశ్చాతాపం వ్యక్తం చేయడంతో అక్కడితో వివాదానికి పుల్ స్టాప్ పెట్టినట్టు అవుతుంది.

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి అలాంటి ఒక సన్నివేశం ఎదురైంది. సాధారణంగా వివాదాలకు దూరంగా తాను మాట్లాడే మాటలను ఎంతో ఆచితూచి మాట్లాడే రాజమౌళి స్టార్ హీరో విషయంలో తన తప్పును అంగీకరించారు.

15 ఏళ్ల కిందట ఎస్ఎస్ రాజమౌళి హృతిక్ రోషన్‌ను ప్రభాస్‌తో పోల్చిన పాత వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో వైర్‌ల్‌గా మారింది. చాలా ఆలస్యంగా వచ్చిన ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో జక్కన్న పలు వ్యాఖ్యలు చేశారు. దాంతో అది సోషల్ మీడియాలో సునామీగా మారింది. అభిమానులలో కాస్త అభిప్రాయ భేదాలకు ఇది కారణమైంది.

ఆ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ మన ప్రభాస్ ముందు హృతిక్ రోష‌న్ న‌థింగ్ అని కామెంట్ చేశాడు. ఆ పాత వీడియో కొత్తగా వైరల్ అవ్వడంతో పలువురు రాజమౌళి వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు. ఇది తన దృష్టికి రావడంతో రాజమౌళి దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఆ సమయంలో తన పదాల ఎంపిక తప్పు. హృతిక్‌ని కించపరిచే ఉద్దేశం నాకు లేదని ఆయన అన్నారు. ఇది చాలా కాలం నాటి వీడియో. 15, 16 సంవత్సరాల క్రితం అనుకుంటున్నాను. కానీ నా పదాల ఎంపిక సరిగా లేదు. నేను దానిని అంగీకరించాలి. అతనిని ఎప్పుడు కించపరచడం నా ఉద్దేశం కాదు. నేను అతన్ని చాలా గౌరవిస్తాను అని వివరణ ఇచ్చారు.

పాత వీడియో గ్లిమ్స్ లో రెండేళ్ల క్రితం ధూమ్ 2 విడుదలైనప్పుడు బాలీవుడ్ మాత్రమే ఇంత నాణ్యమైన చిత్రాలను ఎందుకు తీయగలదు అని నేను ఆశ్చర్యపోయాను. హృతిక్‌ లాంటి హీరోలు మనకు లేరా? ఇప్పుడే బిల్లా పాటలు పోస్టర్ ట్రైలర్ చూశాను.

ఒకటి మాత్రం చెప్పగలను. ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ నథింగ్ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా వైరల్ కావడం ఆస్కార్ రేసులో ఉన్న సమయంలో ఈ దుమారం చెల‌రేగ‌డం రాజమౌళికి కాస్త ఇబ్బంది కలిగించే విషయమే అని చెప్పాలి..!

Updated On 16 Jan 2023 1:27 PM GMT
krs

krs

Next Story