Saturday, April 1, 2023
More
    HomelatestHuge Investment । తెలంగాణ‌కు మ‌రో భారీ పెట్టుబ‌డి.. ల‌క్ష మందికి ఉపాధి క‌ల్ప‌న‌

    Huge Investment । తెలంగాణ‌కు మ‌రో భారీ పెట్టుబ‌డి.. ల‌క్ష మందికి ఉపాధి క‌ల్ప‌న‌

    Huge Investment । ELACTRANIC PRODUCTIONS, Hon Hai Fox Conn, Young Liu, CM KCR

    • ప్రభుత్వంతో ‘హోన్ హై ఫాక్స్ కాన్ ’ ఒప్పందం
    • భారీ పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం
    • ఒకే సంస్థ ద్వారా లక్ష ఉద్యాగాల కల్పన
    • ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సంస్థ చైర్మన్ యంగ్ ల్యూ భేటీ
    • ల్యూకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌

    Huge Investment । విధాత: తెలంగాణ రాష్ట్రంలో ఇప్ప‌టికే ప‌లు అంత‌ర్జాతీయ కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టాయి. ఇప్పుడు ఆ అంత‌ర్జాతీయ కంపెనీల స‌ర‌స‌న మ‌రో కంపెనీ వ‌చ్చి చేరింది. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్ హై ఫాక్స్ కాన్ ’ (Hon Hai Fox Conn) సంస్థ తెలంగాణ‌లో పెట్టుబడులు పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

    ఈ మేరకు సంస్థ చైర్మన్ యంగ్ ల్యూ (Young Liu) నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో గురువారం ప్రగతి భవన్‌లో సమావేశమైంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు (Investment) పెట్టేందుకు ఫాక్స్ కాన్ కంపెనీ ముందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది.

    ఈ ఒప్పందం ద్వారా Hon Hai Fox Conn సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. తద్వారా ఒక లక్ష ఉద్యోగాల కల్పనకు దారులు వేసింది. దాంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి లభ్యం కానున్నది.

    ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ముఖ్యమైనది. ఒకే సంస్థ ద్వారా లక్షమందికి నేరుగా ఉద్యోగాలు లభించడం అత్యంత అరుదైన విషయం. ఈ ఘనతను తెలంగాణ ప్రభుత్వం సాధించింది.

    యంగ్ ల్యూ’ పుట్టిన రోజు కూడా ఇదే రోజుకూడా కావడంతో స్వదస్తూరితో ప్రత్యేకంగా తయారు చేయించిన గ్రీటింగ్ కార్డును సీఎం కేసీఆర్ స్వయంగా యంగ్‌ ల్యూకు అందచేశారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమావేశం అనంతరం ప్రగతి భవన్ (Pragathi Bhavan)లో యంగ్ ల్యూ ప్రతినిధి బృంధానికి మధ్యాహ్న భోజనంతో సీఎం కేసీఆర్ ఆతిథ్యమిచ్చారు.

    ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు, (KTR), వైద్యారోగ్యం, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు (Harish Rao), విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabita Indra Reddy), ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (Shanti kumari),

    డీజీపీ అంజనీ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి, డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్ సుజయ్ కారంపురి, ఐటీ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్ తదితరులు పాల్గొన్నారు.

    లక్ష ఉద్యోగాలు.. స్థానిక తెలంగాణ యువతకే: సీఎం కేసీఆర్‌

    అంతర్జాతీయంగా అనేక దేశాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగ ముఖ చిత్రాన్ని గుణాత్మకంగా మార్చిన గొప్ప సంస్థ ‘హోన్ హై ఫాక్స్ కాన్ ’ తమ ఉత్పత్తి కార్యకలాపాలకు తెలంగాణ రాష్ట్రాన్ని గమ్యస్థానంగా ఎంచుకోవడంపై ఆ సంస్థకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

    ఈ సందర్భంగా ఫాక్స్ కాన్ సంస్థ భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపైన కూలంకషంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో ఫాక్స్ కాన్ సంస్థ కార్యకలాపాలకు అన్ని రకాల సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా చైర్మన్ యంగ్ ల్యూకి హామీ ఇచ్చారు.

    తెలంగాణ స్వరాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించి భారీగా పెట్టుబడులను రప్పించడంలో తమ ప్రభుత్వం విజయవంతమైందని సీఎం అన్నారు. రాష్ట్రంలో ఫాక్స్ కాన్ ’ భారీ పెట్టుబడి పెట్టడంతో పాటు గతంలో లేని విధంగా లక్షకు పైగా ఉద్యోగాల కల్పనకు అవకాశం రావడం గొప్ప విషయం అన్నారు. ఈ లక్ష ఉద్యోగాలను సాధ్యమైనంత వరకు స్థానిక తెలంగాణ యువతకు దక్కేలా చర్యలు చేపడుతామని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తెలిపారు.

    ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం గురించి తమ సంస్థ విస్తృతంగా అధ్యయనం చేసిందన్నారు. ఇక్కడి పారిశ్రామిక అనుకూల వాతావరణం పైన ఫాక్స్ కాన్ చైర్మన్ ప్రశంసలు కురిపించారు. ఎనిమిది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం, పారిశ్రామిక రంగంలో, ముఖ్యంగా ఐటి, అనుబంధ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో సాధించిన అభివృద్ధి పైన ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తమ సంస్థ పెట్టుబడుల విషయంలో ఆశావాహ దృక్పథంతో ఉన్నామన్నారు.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular