విధాత,తిరుప‌తి: త‌న భ‌ర్త‌ను మ‌రో మ‌హిళ క‌న్నెత్తి చూస్తేనే ఓర్చుకోలేని పెళ్లాలు ఉన్న ఈ కాలంలో ఓ మ‌హిళ ఏకంగా త‌న భ‌ర్త‌కు టిక్‌టాక్‌లో ప‌రిచ‌యం ఏర్ప‌డిన యువ‌తితో ద‌గ్గ‌రుండి మ‌రీ రెండో పెళ్లి చేసింది. తిరుపతి జిల్లా డక్కిలి మండలం అంబేడ్కర్ నగర్‌కు చెందిన ఓ యువకుడు డిగ్రీ వరకు చదివాడు. టిక్‌టాక్‌లో రాణిస్తున్న అతడికి మొదట విశాఖకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. కొన్నాళ్లు ఇద్దరూ చనువుగా ఉండి […]

విధాత,తిరుప‌తి: త‌న భ‌ర్త‌ను మ‌రో మ‌హిళ క‌న్నెత్తి చూస్తేనే ఓర్చుకోలేని పెళ్లాలు ఉన్న ఈ కాలంలో ఓ మ‌హిళ ఏకంగా త‌న భ‌ర్త‌కు టిక్‌టాక్‌లో ప‌రిచ‌యం ఏర్ప‌డిన యువ‌తితో ద‌గ్గ‌రుండి మ‌రీ రెండో పెళ్లి చేసింది.

తిరుపతి జిల్లా డక్కిలి మండలం అంబేడ్కర్ నగర్‌కు చెందిన ఓ యువకుడు డిగ్రీ వరకు చదివాడు. టిక్‌టాక్‌లో రాణిస్తున్న అతడికి మొదట విశాఖకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. కొన్నాళ్లు ఇద్దరూ చనువుగా ఉండి తర్వాత ఆమె నుంచి దూరమయ్యాడు.

త‌రువాత టిక్‌టాక్‌లోనే పరిచయమైన కడపకు చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు త‌రువాత విశాఖ యువతి మ‌ళ్లీ యువ‌కుడి వ‌ద్ద‌కు వ‌చ్చింది. అప్పుడే ఆమెకు అతడికి మ‌రో పెళ్లయిన విషయం తెలిసింది.

కానీ నిరాశపడకుండా.. ఆ యువకుడి భార్యతో మాట్లాడింది. ముగ్గురూ కలిసి ఉండడానికి ఒప్పుకొని తన భర్తకు ఆ యువతితో పెళ్లి చేయడానికి సిద్ధపడడంతో వారి వ్యవహారం పెళ్లిపీటలను చేరింది. తానే దగ్గరుండి భర్త ప్రియురాలిని అలంకరించి బుధవారం పెళ్లి చేసింది.

Updated On 22 Sep 2022 1:36 PM GMT
krs

krs

Next Story