Hyderabad – Goa Tour | వేసవి సెలవులు దగ్గరపడుతున్నాయి. మొన్నటి వరకు వానలు కురవగా.. మళ్లీ వైపు ఎండలు సైతం దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది పర్యాటక ప్రాంతాలకు వెళ్లి రావాలనుకుంటారు. సమ్మర్ వెకేషన్‌కు చాలా మంది గోవా వెళ్లాలని భావిస్తుంటారు. ఇక్కడ అందమైన బీచ్‌లు ఆకట్టుకోవడంతో పాటు చర్చిలు, రిసార్ట్స్‌లు పర్యాటకులను అలరిస్తాయి. గోవా వెళ్లాలనుకునే వారికి తెలంగాణ టూరిజం శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి గోవా టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీలో మపుసా సిటీ, లార్డ్ బోడ్గేశ్వర్ టెంపుల్, ఫోర్ట్ అగ్వాడా, బాగా బీచ్, కలంగుట్ బీచ్, వాగేటర్ బీచ్ తదితర ప్రాంతాలను సందర్శించేందుకు వీలున్నది. మూడు రాత్రులు, నాలుగు రోజుల పాటు పర్యటన కొనసాగనున్నది. ప్రతి సోమవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ నుంచి గోవాకు బస్సు బయలుదేరుతుంది.
ప్రయాణం సాగేదిలా..
Day-1 : బషీర్‌బాగ్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ప్రయాణం మొదలవుతుంది. రాత్రంతా ప్రయాణం కొనసాగుతుంది.
Day-2 : రెండోరోజు ఉదయం 6 గంటలకు గోవాలోని హోటల్ బెవ్వన్ రిస్టార్‌కు చేరుతారు. బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాతం 10 గంటలకు నార్త్ గోవాలోని మపుసా సిటీ, లార్డ్ బోడ్గేశ్వర్ టెంపుల్, ఫోర్ట్ అగ్వాడా, బాగా బీచ్‌లను సందర్శిస్తారు.
Day-3 : మూడో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత సౌత్ గోవాలోని డోనా పౌలా బీచ్, మిరామార్, పాత గోవా చర్చిలు, మంగూషి ఆలయం, కొల్వా, మార్డోల్ బీచ్‌లను సందర్శిస్తారు. సాయంత్రం క్రూజ్ బోట్‌లో ప్రయాణించచ్చు. కానీ బోట్‌లో సొంత ఖర్చులతో ప్రయాణించాల్సి ఉంటుంది.
Day-4 : ఇక నాలుగో రోజు హోటల్ బెవ్వన్ రిసార్ట్ ఉదయం 11 గంటలకు బస్ తిరిగి బయలుదేరుతుంది.
Day-5 : ఉదయం 6 గంటలకు హైదరాబాకు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీ ధరలు ఇలా..
సింగిల్ షేరింగ్‌కు రూ.14, 900 ధర చెల్లించాల్సి ఉంటుంది. పెద్దలకు రూ.9,900, పిల్లలకు రూ.7,920గా ధర నిర్ణయించింది. ప్యాకేజీలో బస్సు టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. బుకింగ్స్ కోసం 9848540371 సంప్రదించాలని టూరిజం శాఖ కోరింది. ఓసీ ఓల్వో బస్, ఏసీ హోటల్ గదిలో రెండు రాత్రుల పాటు వసతి కల్పించనున్నట్లు వివరించింది. పూర్తి వివరాల కోసం tourism.telangana.gov.in/package/goatour వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించింది.