Hyderabad | విధాత: కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన తిరగబడదాం.. తరిమికొడదాం ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో తోడు దొంగలు పేరుతో కేసీఆర్, మోడీ ఇద్దరూ ఒకటే అని చెప్తూ వెలసిన ప్రచార పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. ఒకే పోస్టర్‌లో తమ రాజకీయ ప్రత్యర్థులైన బీఆరెస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌, ప్రధాని నరేంద్ర మోడీ ముఖ చిత్రాలు, తోడు దొంగలు అనే టైటిల్‌తో పోస్టర్‌ ముద్రించి ఫ్లై వోవర్లు, మెట్రో రైలు ఫిల్లర్ల పైన, బస్సుల పైన అంటించారు. బైబై […]

Hyderabad |

విధాత: కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన తిరగబడదాం.. తరిమికొడదాం ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో తోడు దొంగలు పేరుతో కేసీఆర్, మోడీ ఇద్దరూ ఒకటే అని చెప్తూ వెలసిన ప్రచార పోస్టర్లు వైరల్ అవుతున్నాయి.

ఒకే పోస్టర్‌లో తమ రాజకీయ ప్రత్యర్థులైన బీఆరెస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌, ప్రధాని నరేంద్ర మోడీ ముఖ చిత్రాలు, తోడు దొంగలు అనే టైటిల్‌తో పోస్టర్‌ ముద్రించి ఫ్లై వోవర్లు, మెట్రో రైలు ఫిల్లర్ల పైన, బస్సుల పైన అంటించారు.

బైబై కేసీఆర్‌..బైబై మోడీ ట్యాగ్‌లైన్‌ పెట్టారు. ఈ ప్రచార పోస్టర్లు ప్రత్యేకంగా ఉండటంతో అవి ఏమిటోనన్న ఆసక్తితో వాటిని తిలకిస్తున్నారు. ఈ పోస్టర్లు అటు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారాయి.

Updated On 14 Sep 2023 1:48 AM GMT
krs

krs

Next Story