Thursday, March 23, 2023
More
    HomelatestWineshops close | మందుబాబులకు షాకింగ్‌ న్యూస్‌.. రెండు రోజులు మద్యం దుకాణాలు మూసివేత..!

    Wineshops close | మందుబాబులకు షాకింగ్‌ న్యూస్‌.. రెండు రోజులు మద్యం దుకాణాలు మూసివేత..!

    Wineshops close | మందుబాబులకు పోలీసులకు షాకిచ్చారు. సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి 8వ తేదీ ఉదయం 6 గంటలకు వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. హోలీ పండుగ నేపథ్యంలో వైన్స్‌ దుకాణాలను మూసివేయనున్నట్లు తెలిపారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు మద్యం దుకాణాలను మూసివేయాలని మద్యం దుకాణాల నిర్వాహలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మందు తాగి బహిరంగ ప్రదేశాల్లో గొడవలకు దిగితే.. సదరు వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలుంటాయని సీపీ హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. ఏటా నగరంలో హోలీ పండుగ సమయంలో పోలీసులు మద్యం దుకాణాలను మూసివేయించడం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది సైతం మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular