Hydrabad
- MP ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ
విధాత: భారత దేశానికి వచ్చిన ఆస్ట్రేలియా(Australia) దేశ రాయబారి బారీ ఫారెల్ బృందం బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా వారు పార్లమెంట్ సభ్యులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ, పార్లమెంటరీ, రాజ్యాంగ వ్యవస్థల నిర్మాణాలు, పనితీరు, భారత రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాముఖ్యత వంటి అంశాలపై వారు ఉత్తమ్‌తో చర్చించారు.
ఈ సమావేశంలో ఆస్ట్రేలియా కన్సల్ జనరల్ మేడం సారా కిర్ ల్యూ, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మహేష్ గౌడ్ లు పాల్గొన్నారు.