Tuesday, January 31, 2023
More
  Homelatestనేను యాంకరింగ్‌కు గుడ్ బై చెప్పట్లేదు: సుమ

  నేను యాంకరింగ్‌కు గుడ్ బై చెప్పట్లేదు: సుమ

  విధాత: కొద్ది రోజులుగా సుమ కనకాల యాంకరింగ్‌కు గుడ్ బై చెప్పబోతున్న వార్తలు హ‌ల్చ‌ల్ చేశాయి. మొదట్లో బుల్లితెరపై కనిపించిన ఈమె ఆ తర్వాత క‌ళ్యాణ ప్రాప్తిర‌స్తు చిత్రంలో హీరోయిన్‌గా న‌టించింది. ప్రస్తుతం ప్రముఖ రచయిత, దర్శకునిగా మారిన వ‌క్కంతం వంశీతో కలిసి అప్పట్లో ఆమె హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి దాసరి నారాయణరావు వంటి లెజెండ్ దర్శకత్వం వహించాడు. ఇక ఆ తర్వాత ఆమె సినిమాలను పక్కనపెట్టి తనకున్న మాటకారితనంతో స్పాంటేనియస్‌తో యాంకర్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

  యాంక‌రింగ్‌లోకి ఎంద‌రు ఎంట్రీ ఇచ్చినా నెంబర్ వన్ స్థానం మాత్రం ఆమెకే దక్కుతుంది. ఇంకో ప‌దేళ్ల‌ వరకు కూడా ఈమెనే నెంబర్ వన్ అనేంత స్టార్‌డ‌మ్ తెచ్చుకుంది. వాస్తవానికి మలయాళీ అయిన ఈమె తెలుగులో అన‌ర్గ‌ళంగా మాట్లాడుతుంటే తెలుగులో పుట్టి పెరిగినవారు కూడా ఇంత గొప్పగా మాట్లాడ‌రేమో…? ఇంత స్పాంటేనియస్‌గా స్పందించరేమో..? అని అనిపిస్తుంది. సినిమా ఈవెంట్ల కోసం సుమనే కావాలని టాలీవుడ్‌లోని చాలామంది క్యూలో ఉంటారు. ఆర్ఆర్ఆర్ వంటి బడా సినిమాల ప్రమోషన్లకు సుమ అవసరం ఏర్పడిన సంగతి గమనిస్తే ఆమె రేంజ్ ఏమిటో అర్థమవుతుంది. అలాంటి సుమ తాజాగా యాంకరింగ్ మానేసిందనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి.

  ఈ వార్త ఎలా పుట్టుకొచ్చింది అంటే డిసెంబర్ 31న ఇయర్ ఎండింగ్ కావడంతో ఈటీవీలో ఓ కార్యక్ర‌మం టెలికాస్ట్ కాబోతోంది. అందుకు సంబంధించి ప్రోమో కూడా రిలీజ్ అయింది. ఇందులో సుమ.. నేను ఎన్నో ఏళ్లుగా యాంకరింగ్ చేస్తున్నాను. కాబట్టి కొద్ది రోజులు బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నాను అంటూ ఎమోషనల్‌గా చెప్పిన డైలాగ్ ఉంది. అందుకే ఈ వార్తలు మొదలయ్యాయి. దాంతో సుమ యాంకరింగ్ మానేస్తుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

  దీనిపై సుమ స్నేహితులు, స‌న్నిహితులు ఆమెకు కాల్ చేసి ఆరా తీస్తున్నారట. ఈ విషయంపై సుమా క్లారిటీ ఇస్తూ ఓ వీడియో చేసింది. ఈ వీడియో ద్వారా ఆమె ఈ విషయాలపై స్పందిస్తూ న్యూ ఇయర్ స్పెషల్ గా ఓ ఈవెంట్ చేశాం. అందుకు సంబంధించి ఆ ప్రోమోలో నేను కొంచెం ఎమోషనల్ అయిన మాట వాస్తవమే. అయితే ఈవెంట్ పూర్తిగా చూస్తే అసలు విషయం ఏంటో మీకు అర్థం అవుతుంది.

  అప్పటివరకు కంగారు పడకండి. ఇప్పటికే నాకు చాలామంది ఏంటి యాంకరింగ్ మానేస్తున్నావ్ అంటు ఫోన్ చేయడం… మెసేజులు పెట్టడం చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒక్కటే. నేను టీవీ కోసమే పుట్టాను. నేను ఎంటర్టైన్మెంట్ కోసమే పుట్టాను. నేను ఎటు వెళ్లడం లేదు. కాబట్టి మీరు కంగారు పడకుండా హాయిగా హ్యాపీగా ఉండండి. మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. దీంతో ఆమె అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.

  కళ్యాణ ప్రాప్తిరస్తు చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఆమె ఆ తర్వాత పవిత్ర ప్రేమ, చాలా బాగుంది, కలిసి నడుద్దాం, వర్షం, స్వరాభిషేకం, ప్రేమికులు, ఢీ, బాద్షా, ఓ బేబీ, జయమ్మ పంచాయితీ వంటి చిత్రాలను చేసింది. కళ్యాణ ప్రాప్తిరస్తు తర్వాత ఆమె పూర్తిగా నిడివి కలిగిన పాత్రను ఇదే ఏడాది జ‌య‌మ్మ పంచాయితీతో చేసి మెప్పించింది. కానీ ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. మరి రాబోయే కాలంలో సుమకు మరిన్ని మంచి సినిమా అవకాశాలు వస్తాయేమో చూడాలి. ఎందుకంటే టాలెంట్ పరంగా చూసుకుంటే అనసూయ కంటే సుమ ఎన్నో రెట్లు పై స్థానంలో ఉంది. కాకపోతే అందచందాలు, గ్లామ‌ర్, ఎక్స్‌పోజింగ్ వంటి విష‌యాల‌లో మాత్రం అనసూయతో పోలిస్తే సుమా కాస్త వెనుకబడి ఉందనే ఒప్పుకోవాలి.

  RELATED ARTICLES

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  Cinema

  Politics

  Most Popular