విధాత: చాలామంది మరీ హైట్‌గా ఉంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కొందరు దానిని ప్లస్ పాయింట్‌గా భావిస్తే మరికొందరు దాన్ని మైనస్ అనుకుంటారు. నిజానికి హీరోయిన్లు మంచి హైట్ ఉంటే అది ప్లస్ అవుతుంది. అదే మామూలు అమ్మాయిలకు మంచి హైట్ ఉంటే వివాహానికి అబ్బాయిలు దొరకడం కష్టమని, అంతకంటే హైట్ ఉండే వారు చాలా తక్కువ అని కామెంట్లు వినిపిస్తుంటాయి.
కానీ సినీ రంగంలో మాత్రం హైట్ అనేది ఎప్పుడూ ప్లస్ పాయింటే. ఇక విషయానికి వస్తే కమల్ హాసన్ గారాల పట్టి శృతిహాసన్ టాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్లలో ఒకరు. ఆమె వచ్చే ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘వాల్తేరు వీరయ్య’లో చిరుకు జోడిగా కనిపించనున్న ఆమె.. నందమూరి నటసింహం వీరసింహ రెడ్డి సినిమాలో బాలయ్య పక్కన ఆడి పాడింది.
ఇక ఈమె దేశవ్యాప్తంగా ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్న ‘సలార్’ మూవీలో ప్రభాస్‌కు జోడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ప్రభాస్‌తో జోడి అంటే బాగా హైట్ ఉన్న వాళ్లకే ఆ అవకాశాలు వస్తాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కెజియఫ్ సిరీస్ తర్వాత రూపొందుతున్న ‘సలార్’ మూవీలో మొదట శృతిహాసన్‌ను పెట్టుకున్నప్పుడు నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. సరైన హీరోయిన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్నిక చేయలేదు అని కాస్త నెగటివ్ ప్రచారం జరిగింది. ఇదే విషయంపై శృతిహాసన్ స్పందించింది.
ఆమె మాట్లాడుతూ తన కెరీర్‌కు సంబంధించిన షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. నాలో కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయని తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. కెరీర్ తొలినాళ్లలో చాలామంది నా హైట్ గురించి నెగటివ్‌గా కామెంట్ చేసే వారు. నా హైట్ నాకు మైనస్ అవుతుందని నాతో చెప్పే వారు. ఆ కామెంట్లు నన్ను కూడా బాధించాయి.
అయితే సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత అందరూ మైనస్ అనుకున్నదే నాకు ప్లస్ అయింది. నా హైటే నాకు బాగా హెల్ప్ అయ్యింది. ఆ హైట్ వల్లనే మహేష్, ప్రభాస్ వంటి ఆజానుబాహులకు జోడిగా నటించే లక్కీ ఛాన్సు నేను సొంతం చేసుకున్నాను. ఇప్పుడు నా హైటే నాకు ప్లస్ పాయింట్ అని కచ్చితంగా చెప్పగలను.
అయినప్పటికీ నాలో ఇంకా కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. వాటిని సరిదిద్దుకుంటూ విజయవంతంగా కెరీర్‌ను కొనసాగిస్తున్నాను అని వెల్లడించింది. శృతిహాసన్ మధ్యలో కొన్ని సంవత్సరాల పాటు కెరీర్ పరంగా బ్రేక్ తీసుకుంది. ఆ బ్రేకులు రాకుండా ఉంటే ఆమె ఇప్పటికీ ఫేడ్ అవుట్ కాకుండా నిత్యం సినిమాల్లో కనిపిస్తూ ఉండేది.
ప్రస్తుతం మూడు కోట్ల దాకా రెమ్యూనరేషన్ అందుకుంటున్న ఈ భామ సంక్రాంతి చిత్రాలైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలతో పాటు పాన్ ఇండియా చిత్రమైన సలార్ విడుదలయితే తన రెమ్యూనరేషన్‌ను మరింత పెంచాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి శృతి కెరీర్ వచ్చే ఏడాది ఆమెకు మరపురాని సంవత్సరంగా మిగులుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.