21వ శతాబ్దపు కౌరవులు.. RSS ప్రతినిధులు విధాత: కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఒకప్పటి రాహుల్ గాంధీని కాదు.. రాహుల్ గాంధీని చంపేశానని వ్యాఖ్యానించారు. మీరు చూస్తున్న రాహుల్ గాంధీ వేరు. రాహుల్ మీ మనసులో ఉన్నాడని ఆయన బదులిచ్చారు. భారత్ జోడో యాత్రలో భాగంగా మీ ఇమేజ్ మారిందా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు రాహుల్ పై విధంగా సమాధానం ఇచ్చారు. pic.twitter.com/zfxis1y2Z8 — vidhaathanews (@vidhaathanews) […]

21వ శతాబ్దపు కౌరవులు.. RSS ప్రతినిధులు
విధాత: కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఒకప్పటి రాహుల్ గాంధీని కాదు.. రాహుల్ గాంధీని చంపేశానని వ్యాఖ్యానించారు. మీరు చూస్తున్న రాహుల్ గాంధీ వేరు. రాహుల్ మీ మనసులో ఉన్నాడని ఆయన బదులిచ్చారు. భారత్ జోడో యాత్రలో భాగంగా మీ ఇమేజ్ మారిందా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు రాహుల్ పై విధంగా సమాధానం ఇచ్చారు.
— vidhaathanews (@vidhaathanews) January 10, 2023
ఒకప్పటి రాహుల్ గాంధీ మీ మనసులో ఉన్నాడు. కానీ నాలో లేడు. మీరు దాన్ని గుర్తించాలని సూచించారు. నాటి రాహుల్ బీజేపీ నాయకుల తలలో ఉన్నాడు. కానీ నాలో కాదని పదేపదే పలు ఉదాహరణలతో రాహుల్ వివరణ ఇచ్చారు. ఇక నిన్న హర్యానాలోని కురుక్షేత్ర జిల్లా ఖాన్‌పూర్ కొలియాన్ నుంచి ప్రారంభమైన జోడోయాత్రలో అందరూ మహిళలే పాల్గొనడం విశేషం.
ఈ సందర్భంగా రాహుల్ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఆర్ఎస్ఎస్ ప్రతినిధులను 21వ శతాబ్దపు కౌరవులని విమర్శించారు. 21వ శతాబ్దపు కౌరవుల గురించి మీకు చెబుతా. వారు ఖాకీ నిక్కర్లు ధరించి, చేతిలో లాఠీలు పట్టుకుంటారు. వారి వెంట ఇద్దరు-ముగ్గురు కుబేరులు ఉన్నారు. పాండవులు నోట్లు రద్దు చేస్తారా? తప్పుడు జీఎస్టీ అమలు చేస్తారా? ప్రధాని మోదీ ఈ నిర్ణయాలు తీసుకున్నారు’’ అని రాహుల్ గాంధీ మండిపడ్డారు.
