High Court | వివేకా హత్య కేసులో ఏ-2గా ఉన్న సునీల్‌యాదవ్ సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ తదుపరి విచారణ సెప్టెంబర్ 8కి వాయిదా హైదరాబాద్, విధాత : వైఎస్ వివేకా హత్య కేసులోని నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ కేసులో ఏ-2 గా ఉన్న సునీల్ యాదవ్‌కు వివేకా హత్యతో ఎలాంటి సంబంధం లేదని ఉద్ధేశపూర్వకంగా ఇరికించారని ఆయన తరుఫు న్యాయవాది వాదించారు. […]

High Court |
- వివేకా హత్య కేసులో ఏ-2గా ఉన్న సునీల్‌యాదవ్
- సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
- తదుపరి విచారణ సెప్టెంబర్ 8కి వాయిదా
హైదరాబాద్, విధాత : వైఎస్ వివేకా హత్య కేసులోని నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ కేసులో ఏ-2 గా ఉన్న సునీల్ యాదవ్‌కు వివేకా హత్యతో ఎలాంటి సంబంధం లేదని ఉద్ధేశపూర్వకంగా ఇరికించారని ఆయన తరుఫు న్యాయవాది వాదించారు. వివేకా హత్య జరిగిన ప్రాంతంలో సునీల్ యాదవ్ ఉన్నడన్న గూగుల్ టేకౌట్ సమాచారం తప్పని న్యాయస్థానానికి తెలిపారు.
2021 ఏప్రిల్ 29న తెల్లవారుజామున 2:30 గంటలకు సునీల్ యాదవ్ సంఘటన స్థలంలో ఉన్నడని గూగుల్ టేకౌట్ ఆధారంగా సీబీఐ తెలిపిందని, అదే సీబీఐ 23 జనవరి 2023 ఛార్జ్‌షీట్‌లో గూగుల్ టేకౌట్ విషయంలో పొరపాటు జరిగిందని అంగీకరించినట్లు తెలపారు. యూనివర్సల్ టైం ప్రకారం ఉయం 2:30కాగా భారత కాలమానం ప్రకారం ఐదున్నర గంటలు కలపాలని అప్పుడు సమయం ఇండియన్ కాలమానం ప్రకారం ఉదయం 8:12 అవుతుందని తెలిపారు.
సీబీఐ తెలిపినట్లు సునీల్ యాదవ్ ఆ టైం కి అక్కడుంటే హత్యతో సంబంధం లేనట్టేనని పేర్కొన్నారు. అందుచేత సునీల్ యాదవ్‌కు బేయిల్ మంజూరు చేయాలని న్యాయవాది పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను సెప్టెంబర్ 8కి వాయిదా వేసింది.
దస్తగిరి విషయంలో సునీత అభ్యంతరం తెలుపలేదు..
షేక్ దస్తగిరి తానే స్వయంగా వివేకను హత్య చేశానని అంగీకరించినా ఆయన ముందుస్తు బెయిల్ విషయంలో సునీతా ఎక్కడా అభ్యంతరం తెలుపలేదని కానీ సునీల్ యాదవ్ బెయిల్ విషయంలో ఇంప్లీడ్ అయ్యారని తెలిపారు. సునీత స్వార్థ ప్రయోజనాల కోసం ఇలా చేస్తున్నదని ఈ కేసులో ఆమే బాధితురాలు కానే కాదని, తనకు తాను బాధితులుగా ప్రచారం చేసుకుంటున్నదని తెలిపారు.
తండ్రి వివేకా హత్యతో ఆమె కుటుంబం మాత్రమే లబ్ధిదారులు అన్న విషయం గమనించాలని, కోర్టు విచారణ ప్రక్రియను పిటిషన్లు కౌంటర్లతో దుర్వినియోగం చేస్తుందని సీబీఐ దర్యాప్తు, ప్రాసిక్యూషన్‌లో ఉద్దేశపూర్వకంగా జోక్యం చేసుకుంటుందని అన్ని విషయాల్లో సునీత ప్రమేయం దర్యాప్తును ప్రాసిక్యూషన్ తప్పుపట్టించేలా ఉన్నదని తెలిపారు.
అజయ్ కల్లం పిటిషన్‌పై సీబీఐకి నోటీసులు..
వివేకా హత్యకేసులో తన స్టేట్‌మెంట్‌ను తప్పుగా దృవీకరించారంటూ మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లం వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. తన పేరుతో కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో తాను చెప్పని విషయాలను సీబీఐ అధికారి తప్పుగా రికార్డు చేశారని అజయ్ కల్లం ఉన్నత న్యాయస్థానాన్ని సంప్రదించిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 15కు వాయిదా వేసింది.
