విధాత: మునుగోడు ప్రజలు ప్రజా శాంతి పార్టీ అభ్యర్థి కేఏ పాల్ ప్రచారాన్ని ఆదరించారు. కానీ ఓట్లు వేయడంలో మాత్రం కనికరించలేదు. లక్షా పది వేల ఓట్లు తన గుర్తు పై పడతాయని చెప్పిన పాల్‌కు బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేస్తుంటే ప్రతి రౌండ్‌లో పదుల సంఖ్యలో మాత్రమే ఓట్లు కనిపిస్తున్నాయి. తాను ఓడిపోతే అమెరికా నుంచి మునుగోడు పై అణు బాంబు వేస్తానన్న పాల్ వ్యాఖ్యలను ఎవరూ సీరియస్‌గా తీసుకోకున్నా.. ఉత్కంఠ సృష్టించిన మునుగోడు ఉప […]

విధాత: మునుగోడు ప్రజలు ప్రజా శాంతి పార్టీ అభ్యర్థి కేఏ పాల్ ప్రచారాన్ని ఆదరించారు. కానీ ఓట్లు వేయడంలో మాత్రం కనికరించలేదు. లక్షా పది వేల ఓట్లు తన గుర్తు పై పడతాయని చెప్పిన పాల్‌కు బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేస్తుంటే ప్రతి రౌండ్‌లో పదుల సంఖ్యలో మాత్రమే ఓట్లు కనిపిస్తున్నాయి.

తాను ఓడిపోతే అమెరికా నుంచి మునుగోడు పై అణు బాంబు వేస్తానన్న పాల్ వ్యాఖ్యలను ఎవరూ సీరియస్‌గా తీసుకోకున్నా.. ఉత్కంఠ సృష్టించిన మునుగోడు ఉప ఎన్నిక మొత్తం ఎపీసోడ్‌లో ఉపశమనం మాత్రం కలిగించింది కేఏ పాల్ ఒక్కడు మాత్రమేనని అందరూ అంగీకరిస్తున్నారు.

మునుగోడు: 10297 ఓట్ల మెజార్టీతో కూసుకుంట్ల ఘనవిజయం

అంతకుముందు పాల్‌ మునుగోడులో విజయోత్సవ ర్యాలీ కోసం అధికారులను అనుమతి కోరగా వారు ఇందుకు నిరాకరించినట్లు సమాచారం. అయితే వెల్లడవుతున్న ఫలితాలు ఆయనకు వ్యతిరేఖంగా రావడంతో కౌంటింగ్‌ కేంద్రాల వద్ద హంగామా సృష్టించారు.

కావాలనే నా పై కక్షకట్టి నా ఓటర్స్ ని కొనేశారని, రీ కౌంటింగ్‌కి దరఖాస్తు చేస్తానని అన్నారు. ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పాల్‌కి ఇప్పటివరకు 6 రౌండ్లలో కలిపి 261 ఓట్లు వచ్చాయి.

మునుగోడు టీఆర్‌ఎస్‌దే?.. ప్రజల మనోగతం ఇదే! (విధాత ప్రత్యేక సర్వే నిజమైంది)

Updated On 6 Nov 2022 12:00 PM GMT
krs

krs

Next Story