విధాత, తాడేపల్లి: జనసేన సభకు స్థలం ఇచ్చారన్న అక్కసుతోనే ఇప్పటం గ్రామంలో జగన్ ప్రభుత్వం ఇళ్లు కూల్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇప్పటంలో ఇళ్లు కూల్చిన ప్రాంతాన్ని ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ మార్చిలో జరిగిన జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇస్తే, ఏప్రిల్‌లో వారి ఇళ్లు కూల్చేస్తామని నోటీసులు ఇచ్చారన్నారు. ఇది కేవలం జనసేనకు సహకరించారనే కక్ష్యతోనే జరిగిందన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇళ్లు పెదకాకాని […]

విధాత, తాడేపల్లి: జనసేన సభకు స్థలం ఇచ్చారన్న అక్కసుతోనే ఇప్పటం గ్రామంలో జగన్ ప్రభుత్వం ఇళ్లు కూల్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇప్పటంలో ఇళ్లు కూల్చిన ప్రాంతాన్ని ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ మార్చిలో జరిగిన జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇస్తే, ఏప్రిల్‌లో వారి ఇళ్లు కూల్చేస్తామని నోటీసులు ఇచ్చారన్నారు.
ఇది కేవలం జనసేనకు సహకరించారనే కక్ష్యతోనే జరిగిందన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇళ్లు పెదకాకాని రోడ్డు విస్తరణలో ఉన్నా, ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు. ఇప్పటంలో ఇళ్లు కోల్పోయిన బాధితులు మాట్లాడేందుకు కూడా ఎందుకు అడ్డుపడుతున్నారని, ఇలా కూల్చుకుంటే వెళ్లే జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చివేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
వైసీపీ నాయకులు రోడ్లను కబ్జా చేసి ఇళ్లు కట్టుకున్న రాజమండ్రి, కాకినాడల్లో ఎందుకు రోడ్లు వెడెల్పు చేయడం లేదని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోతే పులివెందులలో జగన్ ఇంటి మీదనుంచి హైవే వేస్తామన్నారు.
గుంతలు పూడ్చలేరుకానీ ఇళ్లను కూల్చుతారు
జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. గుంతలకు కనీసం తట్టెడు మట్టి కూడా వేయలేని చేతకాని స్థితిలో ఉన్న జగన్ ప్రభుత్వం.. కష్టపడి కట్టుకున్న ఇళ్లను మాత్రం కూల్చడానికి ఉత్సాహం చూపిస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వ కూల్చివేతలకు సహకరిస్తున్న పోలీసులు కూడా ఆలోచించాలని, పోలీసులు కూడా మన సోదరులే కాబట్టి వారి వైఖరికి వ్యతిరేకంగా చేతులు కట్టుకొని నిరసనలు చేపట్టండని పవన్ పిలుపునిచ్చారు.
