విధాత‌: శ్రీదేవి నన్ను పెళ్లి చేసుకుంది.. ముంబైలో కొన్నాళ్ళు కాపురం ఉన్నాం.. మాధురికి నాతో ఓ కూతురు ఉంది.. తమన్నా నేనూ డేటింగ్ లో ఉన్నాం.. విజయశాంతికి నాకు ఉమ్మడిగా ఇల్లుంది… రేఖ నన్ను కొన్నాళ్ళు లవర్ గా ఉండమంది అంటూ కొందరు హాల్ చల్ చేస్తుంటారు. వీటిని కొన్నాళ్ళు పత్రికలు, మీడియాలో చూసి జనాలు లైట్ తీసుకుంటుంటారు. ఇదే తీరుగా రాజకీయ నాయకులకు సైతం చిత్రమైన పరిణామాలు ఎదురవుతుంటాయ్. ఇప్పుడు సరిగ్గా ఇలాగే నెల్లూరు జిల్లా […]

విధాత‌: శ్రీదేవి నన్ను పెళ్లి చేసుకుంది.. ముంబైలో కొన్నాళ్ళు కాపురం ఉన్నాం.. మాధురికి నాతో ఓ కూతురు ఉంది.. తమన్నా నేనూ డేటింగ్ లో ఉన్నాం.. విజయశాంతికి నాకు ఉమ్మడిగా ఇల్లుంది… రేఖ నన్ను కొన్నాళ్ళు లవర్ గా ఉండమంది అంటూ కొందరు హాల్ చల్ చేస్తుంటారు. వీటిని కొన్నాళ్ళు పత్రికలు, మీడియాలో చూసి జనాలు లైట్ తీసుకుంటుంటారు.

ఇదే తీరుగా రాజకీయ నాయకులకు సైతం చిత్రమైన పరిణామాలు ఎదురవుతుంటాయ్. ఇప్పుడు సరిగ్గా ఇలాగే నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి సైతం ఓ తలనొప్పి వచ్చింది. మేకపాటి శివ చరణ్ రెడ్డి అనే ఆయన ఓ లెటర్ విడుదల చేసి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి తనకు తండ్రి అని అంటున్నారు.

తమను 18 ఏళ్లు రహస్యంగా ఉంచి విడిచిపెట్టారంటూ మేకపాటి శివచరణ్ రెడ్డి బహిరంగ లేఖ విడుదల చేశారు. తనకు కుమారుడే లేడని ఇటీవల మేకపాటి చంద్రశేఖరరెడ్డి చెప్పడంపై శివచరణ్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశాడు. మీకు కొడుకు లేకపోతే నేను ఎవరిని అంటూ ఆ లేఖలో శివచరణ్ రెడ్డి.. చంద్రశేఖరరెడ్డిని ప్రశ్నించారు.

చదువుకి ఫీజులు చెల్లిస్తే తండ్రి బాధ్యత తీరిపోతుందా అని ప్రశ్నించారు. తన తల్లి తర్వాత పరిచయమైన మహిళను మాత్రం భార్యగా సమాజానికి పరిచయం చేశావంటూ లేఖలో చంద్రశేఖర్రెడ్డిని శివచరణ్ రెడ్డి నిలదీశాడు. అయితే ఈ లేఖ మీద ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి మాత్రం స్పందించలేదు.

Updated On 8 Jan 2023 2:58 AM GMT
krs

krs

Next Story