Saturday, January 28, 2023
More
    Homelatestకాబోయే ముఖ్యమంత్రి నేనే: KA పాల్‌

    కాబోయే ముఖ్యమంత్రి నేనే: KA పాల్‌

    KA PAUL

    విధాత: తెలంగాణలో కాబోయే ముఖ్యమంత్రిని తానేని అవినీతి పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు వచ్చే ఎన్నికలు చివరి ఎన్నికలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కెఏ పాల్ అన్నారు. సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగాల కల్పనపై ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు.

    దేశాన్ని ,రాష్ట్రాన్ని లక్షల కోట్లు అప్పుల పాలు చేశారన్నారు. తాను ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ రాష్ట్రం చేసిన ఐదు లక్షల కోట్లు అప్పు తీర్చగలుగుతానని అందుకు ప్రజలంతా తనకు ఓటు వేయాలని కోరారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తనకు 80వేలకు పైగా ఓట్లు పడ్డాయని, ఈవిఎంల టాంపరింగ్ తో ఓట్లు తారు మారయి తాను ఓడిపోయాను అన్నారు.

    ఉప ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్లు వందల కోట్లు ఖర్చు చేశాయని , ఎన్నికల కమిషనర్ కూడా ఈ విషయం అంగీకరించారన్నారు. వచ్చే ఎన్నికల్లో దేశంలో రాష్ట్రంలో ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని 18 పార్టీలతో పాటు తాను కూడా కోరుతున్నానన్నారు.

    గతంలో తాను దేశ అభివృద్ధికి తాజాగా రాష్ట్ర ప్రగతికి ఎన్నో పరిశ్రమలు తెచ్చానని, లక్షల మందికి ఉద్యోగాలు కల్పించానన్నారు. తాను గతంలో 5 లక్షల కోట్లు ప్రజలకు, ఇప్పుడున్న పార్టీల నాయకులకు, వితంతువులకు పంచిపెట్టానన్నారు. అప్పుడు తాను చెప్పుకోలేదని ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నందున తాను చెబుతున్నానని, ప్రజలు అవినీతి రహిత పాలన కోసం వచ్చే ఎన్నికల్లో తనను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.

    తాను ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో పరిశ్రమలు తెచ్చి ఏటా లక్ష ఉద్యోగాలు ఇస్తానన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల అప్పులపాలు చేసి కొడుకును సీఎం చేయాలని చూస్తున్నా అవినీతి పరుడైన కేసీఆర్ మళ్లీ సీఎం గా కావాలో, లేక మసీదులు మందిరాలు తవ్వితే శివలింగాలు వస్తే మావి..శవాలు వస్తే మీవి అంటూ మాట్లాడిన బండి సంజయ్ సీఎంగా కావాలో, లేక 5 లక్షల కోట్ల అప్పు తీర్చగలిగే సత్తా ఉన్న నేను సీఎంగా కావాలో ప్రజలు వచ్చే ఎన్నికల్లో తేల్చుకోవాలన్నారు. ఇక కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రంలో ,దేశంలో చెప్పుకోదగ్గ స్థాయిలో లేదన్నారు.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular