విధాత: నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు అంటూ మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో చెప్పిన డైలాగ్ నిజమయిందా ??.. ఎప్పుడో నాలుగేళ్ళ కిందటే 2018లో రాజ్యసభ పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న ఆయన్ను ఆ పార్టీ మాత్రం వదల్లేదు. ఆయనను ఇంకా పార్టీ నాయకుడిగానే గుర్తిస్తూ 2027వరకూ చెల్లుబాటు అయ్యేలా పిసిసి డెలిగేట్ అంటూ గుర్తింపు కార్డును సైతం […]


విధాత: నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు అంటూ మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో చెప్పిన డైలాగ్ నిజమయిందా ??.. ఎప్పుడో నాలుగేళ్ళ కిందటే 2018లో రాజ్యసభ పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న ఆయన్ను ఆ పార్టీ మాత్రం వదల్లేదు. ఆయనను ఇంకా పార్టీ నాయకుడిగానే గుర్తిస్తూ 2027వరకూ చెల్లుబాటు అయ్యేలా పిసిసి డెలిగేట్ అంటూ గుర్తింపు కార్డును సైతం ముద్రించి విడుదల చేసింది.

కోవూరు నుంచి పీసీసీ ప్రతినిధిగా చిరంజీవిని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ ఐడీ కార్డును కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పరిశీలకుడిగా ఉన్న మధుసూదన్ మిస్త్రీ సంతకంతో విడుదల చేసింది. అంటే ఆయన గాడ్ ఫాదర్ చిత్రంలో చెప్పినట్లే ఇంకా రాజకీయాల్లో ఉన్నట్లే అన్నమాట చిరు రాజ్యసభ పదవీకాలం 2018లో ముగిసింది.

అంతకుముందు మూడేళ్లు ఆయన కేంద్రంలో మన్మోహన్ సింగ్ సారథ్యంలోని యుపిఎ-2 ప్రభుత్వంలో పర్యాటక మంత్రిగానూ పని చేశారు. ఆ తరువాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.. అలాగని కాంగ్రెస్ కు రాజీనామా చేయలేదు. దాంతో ఆయన ఇంకా ఆ పార్టీ మనిషిగానే వారు చూస్తున్నారు.

ఆ మధ్యన రాహుల్ గాంధీ ఉభయ తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయాలని సంకల్పించి నపుడు కొందరు కీలక నాయకులను ఢిల్లీ రప్పించుకున్నారు. వారితో ఆయన చర్చలు జరుపుతూ చిరంజీవి గురించి వాకబు చేసారని అంటున్నారు.

అంటే కాంగ్రెస్ హై కమాండ్ దృష్టిలో కూడా చిరంజీవి ఉన్నారన్నమాట. ఆయన్ను తమతోనే ఉండేలా చూసుకోవాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది. కానీ ఈమధ్య కాలంలో చిరు రాజకీయాల గురించి మాట్లాడనే లేదు.

జగన్‌తో మంచి రిలేషన్స్ మెంటెయిన్ చేస్తున్న ఆయన ఓ దశలో వైస్సార్సీపీలో చేరుతారని కూడా పుకార్లు వచ్చాయ్. ఏదైతేనేం ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గుర్తింపు కార్డ్ తో అక్టోబర్ 17న జరగబోయే ఎన్నికల్లో ఏఐసీసీ అధ్యక్షుడి ఎన్నికకు ఓటు చేసే హక్కుని సంపాదించుకున్నారు. మరి ఓటు వేస్తారా..కాంగ్రెస్‌కు దూరంగా ఉంటారా చూడాలి.

Updated On 21 Sep 2022 5:11 PM GMT
krs

krs

Next Story