విధాత: మెగాస్టార్ చిరంజీవిని, మెగా ఫ్యాన్స్‌ని పట్టుకోలేనంత ఆనందకరమైన వార్త ఏమై ఉంటుందా? అని అనుకుంటున్నారా? ఇంకేం ఉంటుంది.. ఉపాసన, రామ్ చరణ్ తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త కన్నా.. వారికి ఇంకా ఆనందకరమైన, సంతోషకరమైన వార్త ఏముంటుంది..? తోటి నటీనటులు ఎన్టీఆర్, అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ వంటి వారు ఎప్పుడో పిల్లల్ని కనేసి తల్లిదండ్రులు స్థానాన్ని చేరుకుని.. పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ల పిల్లలైతే స్కూల్‌కి కూడా పోతున్నారు. కానీ, పెళ్లి జరిగి […]

విధాత: మెగాస్టార్ చిరంజీవిని, మెగా ఫ్యాన్స్‌ని పట్టుకోలేనంత ఆనందకరమైన వార్త ఏమై ఉంటుందా? అని అనుకుంటున్నారా? ఇంకేం ఉంటుంది.. ఉపాసన, రామ్ చరణ్ తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త కన్నా.. వారికి ఇంకా ఆనందకరమైన, సంతోషకరమైన వార్త ఏముంటుంది..? తోటి నటీనటులు ఎన్టీఆర్, అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ వంటి వారు ఎప్పుడో పిల్లల్ని కనేసి తల్లిదండ్రులు స్థానాన్ని చేరుకుని.. పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు.

ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ల పిల్లలైతే స్కూల్‌కి కూడా పోతున్నారు. కానీ, పెళ్లి జరిగి పది సంవత్సరాలు అవుతున్నా రామ్ చరణ్ మాత్రం ఆ గుడ్ న్యూస్ చెప్పడం లేదు. అదేమని ప్రశ్నిస్తే.. అది మా పర్సనల్ విషయం అంటూ చరణ్, ఉపాసన ఇద్దరూ దాట వేస్తున్నారు. వారిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారనేలా ఇప్పటికే పలుమార్లు వార్తలు వైరల్ అయ్యాయి.

ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వీరిద్దరూ పేరేంట్స్‌గా ప్రమోషన్ తీసుకోబోతున్నారనేలా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంత నిజముందో తెలియాలి. ఒకవేళ నిజమైతే మాత్రం.. ముందుగా మెగాస్టార్ చిరంజీవిని అస్సలు పట్టుకోలేరు. తన కుమారుడు ఎప్పుడెప్పుడు ఆ న్యూస్ చెబుతాడా? అని ఆయన ఎంతగానో వేచి చూస్తున్నారు.

ఈ మధ్య చరణ్, ఉపాసన ఫారిన్ టూర్ వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ స్థాయిలో వారు విహారం చేసింది లేదు.. కానీ రీసెంట్‌గా వాళ్లు కొన్ని రోజుల పాటు టూర్‌లో గడిపి వచ్చారు. అందుకే.. ఈసారి వినిపిస్తున్న వార్తలు నిజమైతే బాగుండు.. అని మెగాభిమానులు కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

అయితే.. ఇలా ఆశ పడిన ప్రతిసారి వారికి నిరాశే ఎదురవుతుంది. అందుకే ఈసారి పెద్దగా మెగా ఫ్యాన్స్‌లో కూడా కదలిక లేదు. మెగాస్టార్ చిరంజీవి కనుక ఈ విషయం నిజమే అని చెబితే మాత్రం మెగాభిమానులకు అసలు సిసలైన పండగ వచ్చినట్లే. చూద్దాం.. మరి ఈసారి వినిపిస్తున్న వార్తలో ఎంత నిజముందో? నిజంగానే చరణ్, ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారో.. లేదంటే ఇది కూడా ఇంతకు ముందు వినిపించిన రూమర్ వంటిదేనో..? తెలియాలంటే.. మెగా కాంపౌండ్ నుంచి వార్త అధికారికంగా రావాల్సిందే.

Updated On 22 Sep 2022 4:14 PM GMT
krs

krs

Next Story