విధాత: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండవని స్పష్టం చేసిన సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను హెచ్చరించారు. 99 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తామన్న కేసీఆరో మరోసారి ఉద్ఘాటించారు. శాసనసభ్యులు తప్పులు చేయొద్దని సూచించారు.
ఒక వేళ తప్పులు చేసినట్లు రుజువైతే అలాంటి ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కవని కేసీఆర్ హెచ్చరించారు. ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాలకే పరిమితమై ప్రజల్లో ఉండాలని సూచించారు. వీలైతే పాదయాత్రలు చేయాలని చెప్పారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కేసీఆర్ ఆదేశించారు. ఎన్నికలు డిసెంబర్‌లోనే ఉంటాయి కాబట్టి ఆ లోపు ఎన్నికలకు సన్నద్ధం కావాలని చెప్పారు.