Hunter Biden | ఎన్నికలు సమీపిస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చికాకు తప్పేలా కనిపించడం లేదు. తాజాగా తుపాకీ లైసెన్సును అక్రమ వాగ్దానాలు చేసి తీసుకున్నారని పేర్కొంటూ ఆయన కుమారుడు హంటర్ బైడెన్‌పై అభియోగాలు నమోదయ్యాయి. ఈ క్రమంలో అధికారంలో ఉన్న అధ్యక్షుడి సంతానంపై కేసు నమోదైన తొలి ఘటనగా ఇది చరిత్రలో నిలిచిపోనుంది. డెలావర్‌లో ఉన్న యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు హంటర్ బైడెన్ (53) పై అభియోగాలు మోపింది. తాను నార్కోటిక్ డ్రగ్స్‌కు […]

Hunter Biden |
ఎన్నికలు సమీపిస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చికాకు తప్పేలా కనిపించడం లేదు. తాజాగా తుపాకీ లైసెన్సును అక్రమ వాగ్దానాలు చేసి తీసుకున్నారని పేర్కొంటూ ఆయన కుమారుడు హంటర్ బైడెన్‌పై అభియోగాలు నమోదయ్యాయి.
ఈ క్రమంలో అధికారంలో ఉన్న అధ్యక్షుడి సంతానంపై కేసు నమోదైన తొలి ఘటనగా ఇది చరిత్రలో నిలిచిపోనుంది. డెలావర్‌లో ఉన్న యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు హంటర్ బైడెన్ (53) పై అభియోగాలు మోపింది. తాను నార్కోటిక్ డ్రగ్స్‌కు బానిస కానని, అసలు వాటిని వినియోగించనని తప్పుడు డిక్లరేషన్ ఇచ్చి అతడు కోల్ట్ రివాల్వర్‌ను అక్రమంగా పొందారని తన అభియోగ పత్రంలో పేర్కొంది.
2018 అక్టోబరులో ఈ వ్యవహారం జరిగినట్లు తెలిపింది. అయితే ఈ కేసును కోర్టు ముందుకు తెచ్చిన అటార్నీ డేవిడ్ వెస్‌ను అధ్యక్షుడిగా ఉన్నపుడు ట్రంప్ నియమించడం గమనార్హం. రాజకీయ ఒత్తిడి మేరకే డేవిడ్ ఈ అభియోగాలను మోపారని హంటర్ తరఫు న్యాయవాది ఇప్పటికే విమర్శలు కూడా చేశారు.
మరోవైపు ఈ అభియోగాలు కనుక రుజువైతే హంటర్‌కి 10 ఏళ్ల పాటు జైలుశిక్ష పడే అవకాశముంది. జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ వ్యాపారాలను, ఒప్పందాలపై విచారణకు రిపబ్లికన్లు పట్టుబడుతున్నా రని యూఎస్ హౌస్ స్పీకర్ కెవిన్ మెకార్థీ ప్రకటించిన రెండు రోజులకే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. ఈ విచారణ సందర్భంగా హంటర్ సంస్థలకు చెందిన బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఒప్పంద పత్రాలను హౌస్ కమిటీలు పరిశీలిస్తాయి. తద్వారా ఈ వ్యాపారాల వల్ల అధ్యక్షుడికి ఆయాచిత లబ్ధి చేకూరిందా లేదా అని నిర్ధరిస్తాయి.
