DSC | విధాత: త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోయే డీఎస్సీ నోటిఫికేష‌న్‌పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి కీల‌క అప్‌డేట్ ఇచ్చారు. ప్ర‌స్తుతం వెలువ‌డ‌బోయే డీఎస్సీ నోటిఫికేష‌న్‌కు అర్హ‌త గ‌ల అభ్య‌ర్థులు ప్రిపేర్ కావాల‌ని ఆమె సూచించారు. టీచ‌ర్ల ప్ర‌మోష‌న్లు, బ‌దిలీలు జ‌రిగిన త‌ర్వాత ఏమైనా ఖాళీలు ఉంటే మ‌ళ్లీ నోటిఫికేష‌న్ ఇస్తామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. డీఎస్సీ నోటిఫికేష‌న్‌పై రాజ‌కీయ నేత‌లు చేసే విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించుకోవ‌ద్ద‌ని ఆమె కోరారు. హైద‌రాబాద్‌లో మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి టీచ‌ర్ల […]

DSC |

విధాత: త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోయే డీఎస్సీ నోటిఫికేష‌న్‌పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి కీల‌క అప్‌డేట్ ఇచ్చారు. ప్ర‌స్తుతం వెలువ‌డ‌బోయే డీఎస్సీ నోటిఫికేష‌న్‌కు అర్హ‌త గ‌ల అభ్య‌ర్థులు ప్రిపేర్ కావాల‌ని ఆమె సూచించారు. టీచ‌ర్ల ప్ర‌మోష‌న్లు, బ‌దిలీలు జ‌రిగిన త‌ర్వాత ఏమైనా ఖాళీలు ఉంటే మ‌ళ్లీ నోటిఫికేష‌న్ ఇస్తామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. డీఎస్సీ నోటిఫికేష‌న్‌పై రాజ‌కీయ నేత‌లు చేసే విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించుకోవ‌ద్ద‌ని ఆమె కోరారు. హైద‌రాబాద్‌లో మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి టీచ‌ర్ల బ‌దిలీలు, ప్ర‌మోష‌న్లు, డీఎస్సీ నోటిఫికేష‌న్‌పై సంబంధిత అధికారుల‌తో గురువారం స‌మావేశ‌మై చ‌ర్చించారు.

ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంటే కొంత మంది వ్యక్తులు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి స‌బిత మండిప‌డ్డారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఉపాధ్యాయ ఖాళీల భర్తీని డీఎస్సీకి అప్పగించామని మంత్రి స్ప‌ష్టం చేశారు.

ఉపాధ్యాయ ఖాళీల విషయంలో తప్పుడు ఆరోపణలతో రాజకీయ లబ్ది పొందేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారని మంత్రి స‌బిత‌ విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యా రంగానికి పెద్దపీట వేస్తుండటాన్నికాంగ్రెస్ నాయకులు సహించలేకపోతున్నారని పేర్కొన్నారు.

గడచిన తొమ్మిది సంవత్సరాల్లో విద్యా రంగం అభివృద్ధి కోసం రూ. 1,87,269 కోట్లు ఖర్చు చేశామంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి ఎంత ప్రాధాన్యతనిస్తుందో అర్ధమవుతుందని తెలిపారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత 2017లో మొదటిసారి 8,972 పోస్టులను భర్తీ చేయడం కోసం డీఎస్సీ నిర్వహించడం జరిగిందని వివరించారు.

ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయ ఖాళీల్లో గెజిటెడ్ హెడ్ మాస్టర్, ప్రైమ‌రీ స్కూల్ హెడ్‌మాస్టర్ పోస్టులను, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 5,089 ఉపాధ్యాయ పోస్టులను, 1523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్‌ను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంద‌న్నారు. పదోన్నతులు, బదిలీల ప్రక్రియ, నూతన నియామకాలు పూర్తయిన తర్వాత ఖాళీలు ఏమైనా ఉంటే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవించిన తర్వాత గురుకులాల్లో 11 ,715 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, 12 ,150 బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నదని, ఈ సమయంలో అన్ని పార్టీలు, అన్ని వర్గాలు సహకరించాలని కోరారు.

ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయుల ఖాళీల భర్తీని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని, ఈ ప్రక్రియను అడ్డుకొనే వారి మాటలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంపై అనుచిత విమర్శలు చేస్తున్న నాయకుల మాటలను విశ్వసించకుండా నిరుద్యోగులు డీఎస్సీకి సిద్దమై విజయం సాధించాలని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు.

Updated On 31 Aug 2023 1:25 PM GMT
krs

krs

Next Story