విధాత: అమెరికాకు చెందిన ఓ పరిశోధనా సంస్థ భారత్‌కు సంబంధించి విస్తుపోయే నిజాన్ని తెలిపింది. సామూహిక హత్యాకాండ జరిగే ప్రమాదకర దేశాల్లో భారత్‌ ఎనిమిదో స్థానంలో ఉన్నదని తేటతెల్లం చేసింది. పౌరుల భద్రత విషయంలో సూడాన్‌, సోమాలియా, సిరియా, ఇరాక్‌ కన్నా భారత్‌ అధ్వాన్న స్థితిలో ఉండటం ఆందోళన కరం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనం జబ్బలు చరుచుకొంటాం. భిన్నత్వంలో ఏకత్వంతో అలరారుతున్న దేశంగా గొప్పలు పోతాం. కానీ గత కొన్నేండ్లుగా దేశంలో అసహన రాజకీయాలు […]

విధాత: అమెరికాకు చెందిన ఓ పరిశోధనా సంస్థ భారత్‌కు సంబంధించి విస్తుపోయే నిజాన్ని తెలిపింది. సామూహిక హత్యాకాండ జరిగే ప్రమాదకర దేశాల్లో భారత్‌ ఎనిమిదో స్థానంలో ఉన్నదని తేటతెల్లం చేసింది. పౌరుల భద్రత విషయంలో సూడాన్‌, సోమాలియా, సిరియా, ఇరాక్‌ కన్నా భారత్‌ అధ్వాన్న స్థితిలో ఉండటం ఆందోళన కరం.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనం జబ్బలు చరుచుకొంటాం. భిన్నత్వంలో ఏకత్వంతో అలరారుతున్న దేశంగా గొప్పలు పోతాం. కానీ గత కొన్నేండ్లుగా దేశంలో అసహన రాజకీయాలు పెరిగిపోయాయి. మెజారిటీ వాద రాజకీయం అందలమెక్కి మైనారటీ వర్గ ప్రజా సమూహాలపై అనేక రూపాల్లో దాడులకు దిగుతున్నది. గోరక్షకుల పేరుతో జరిగిన అఖ్లాక్‌ ఉదంతం దేశంలోని అసహనానికి ప్రతీక.

ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన ఓ సామాజిక అధ్యయన, పరిశోధన సంస్థ సామూహిక హత్యాకాండ జరిగే ప్రమాదకర దేశాల్లో భారత్‌కు 8వ స్థానమని తెలియజేయటం గమనార్హం. ‘మాస్‌ కిల్లింగ్‌’లో మొదటి స్థానం పాక్‌, యెమెన్‌ రెండు, మైన్మార్‌ మూడో స్థానంలో నిలిచాయి. అయితే.. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మగా చెప్పుకొనే భారత్‌లో ఇలాంటి పరిస్థితులు ఉండటం ఆలోచించదగినది.

Updated On 5 Dec 2022 11:03 AM GMT
krs

krs

Next Story