సర్వం కోల్పోయిన బాధితులు Mancherial | విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ శివారులో శనివారం రౌడీమూకలు రెచ్చిపోయారు. పేదల గుడిసెలకు నిప్పంటించి పరారయ్యారు. బాధితులు సర్వం కోల్పోయారు. తినడానికి తిండిగింజలూ లేకుండా రోడ్డున పడ్డారు. మూకుమ్మడిగా రౌడీల దౌర్జన్యానికి ఎదురుచెప్పలేక కన్నీరుమున్నీరయ్యారు. పట్టణంలోని సర్వే నెంబర్ 8 లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో నిరుపేదలు గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. నివేశన స్థలాల కోసం సీపీఐ ఆధ్వర్యంలో పలు దఫాలుగా […]

  • సర్వం కోల్పోయిన బాధితులు

Mancherial | విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ శివారులో శనివారం రౌడీమూకలు రెచ్చిపోయారు. పేదల గుడిసెలకు నిప్పంటించి పరారయ్యారు. బాధితులు సర్వం కోల్పోయారు. తినడానికి తిండిగింజలూ లేకుండా రోడ్డున పడ్డారు. మూకుమ్మడిగా రౌడీల దౌర్జన్యానికి ఎదురుచెప్పలేక కన్నీరుమున్నీరయ్యారు. పట్టణంలోని సర్వే నెంబర్ 8 లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో నిరుపేదలు గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు.

నివేశన స్థలాల కోసం సీపీఐ ఆధ్వర్యంలో పలు దఫాలుగా ఆందోళనలూ చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఈ క్రమంలో ఉదయం సుమారు 100 మంది రౌడీలు ఆ భూముల్లోకి అక్రమంగా ప్రవేశించారు. పేదల గుడిసెలను చుట్టుముట్టారు. గుడిసె వాసులపై దౌర్జన్యానికి దిగారు. బలవంతంగా వారిని బయటకు నెట్టి, గుడిసెలకు నిప్పంటించారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. మంటలు గుడిసెలన్నింటికీ వ్యాపించాయి. ఉన్నఫలంగా జరిగిన ఘటనతో పేదలు నిస్తేజంగా ఉండిపోయారు.

కళ్లెదుటే గుడిసెలన్నీ బుగ్గయ్యాయి. నిత్యావసర వస్తువులు, బట్టలు, మంచాలు, డబ్బు, సామగ్రి అగ్నికి ఆహుతైంది. బాధితులకు కన్నీరే మిగిలాయి. తమకు కనీసం సామాన్లు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదని బాధితులు వాపోయారు. గుడిసెల్లోకి అక్రమంగా ప్రవేశించి, మాపై దాడి చేసి గుడిసెలకు నిప్పు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Updated On 2 Sep 2023 11:47 AM GMT
somu

somu

Next Story