Brain Surgery |  పుట్ట‌బోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాల‌ని అటు త‌ల్లిదండ్రులు, ఇటు వైద్యులు కోరుకుంటారు. ఒక వేళ పుట్ట‌బోయే బిడ్డ‌కు ఏదైనా లోపం ఏర్ప‌డితే.. సాధ్య‌మైనంత వ‌ర‌కు ఆ లోపాన్ని చ‌క్క‌దిద్దేందుకు వైద్యులు త‌మ శ‌క్తిమేర కృషి చేస్తారు. ఆ మాదిరిగానే అమెరికాకు చెందిన డాక్ట‌ర్లు.. వైద్య‌రంగంలోనే స‌రికొత్త శ‌స్త్ర‌చికిత్స‌కు నాంది ప‌లికారు. త‌ల్లి గ‌ర్భంలో ఉన్న‌ప్పుడే శిశువు మెద‌డ‌కు స‌ర్జ‌రీ నిర్వ‌హించి స‌రికొత్త చ‌రిత్ర సృష్టించారు. అమెరికాలోని బోస్ట‌న్‌కు చెందిన ఓ మ‌హిళ గ‌ర్భం […]

Brain Surgery | పుట్ట‌బోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాల‌ని అటు త‌ల్లిదండ్రులు, ఇటు వైద్యులు కోరుకుంటారు. ఒక వేళ పుట్ట‌బోయే బిడ్డ‌కు ఏదైనా లోపం ఏర్ప‌డితే.. సాధ్య‌మైనంత వ‌ర‌కు ఆ లోపాన్ని చ‌క్క‌దిద్దేందుకు వైద్యులు త‌మ శ‌క్తిమేర కృషి చేస్తారు. ఆ మాదిరిగానే అమెరికాకు చెందిన డాక్ట‌ర్లు.. వైద్య‌రంగంలోనే స‌రికొత్త శ‌స్త్ర‌చికిత్స‌కు నాంది ప‌లికారు. త‌ల్లి గ‌ర్భంలో ఉన్న‌ప్పుడే శిశువు మెద‌డ‌కు స‌ర్జ‌రీ నిర్వ‌హించి స‌రికొత్త చ‌రిత్ర సృష్టించారు.

అమెరికాలోని బోస్ట‌న్‌కు చెందిన ఓ మ‌హిళ గ‌ర్భం దాల్చింది. ఆమె క‌డుపులో పెరుగుతున్న శిశువును అల్ట్రా సౌండ్ ద్వారా ప‌రీక్షించారు. అయితే శిశువు మెద‌డులో లోపం ఏర్ప‌డిన‌ట్లు డాక్ట‌ర్లు గుర్తించారు. మెద‌డు నుంచి గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే ర‌క్త‌నాళాలు స‌రిగా అభివృద్ధి చెంద‌లేద‌ని వైద్యులు నిర్ధారించారు. బిడ్డ పుట్టిన వెంట‌నే సిర‌ల‌పై ఒత్తిడి పెరిగి శిశువు చ‌నిపోయే ప్ర‌మాదం ఉంది. గుండె స‌మ‌స్య‌తో కూడా చ‌నిపోయే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు నిర్ధారించారు. ఈ రెండు కూడా పెద్ద స‌వాళ్లే అని డాక్ట‌ర్లు తెలిపారు. గర్భస్థ శిశువుల్లో మెదడుకు వచ్చే ఈ వ్యాధిని గాలెన్‌ వైకల్యం అని అంటార‌ని డాక్ట‌ర్లు పేర్కొన్నారు.

ఇక ఈ చికిత్స‌ను స‌వాల్‌గా తీసుకున్న బోస్ట‌న్ చిల్డ్ర‌న్ ఆస్ప‌త్రి వైద్యులు.. గ‌ర్భంలోనే ఉన్న శిశువుకు విజ‌య‌వంతంగా శ‌స్త్ర‌చికిత్స నిర్వ‌హించారు. 34 వారాల పిండానికి బోస్ట‌న్ వైద్యులు స‌ర్జ‌రీ నిర్వ‌హించారు. త‌ల్లీబిడ్డ‌ల ప్రాణాల‌ను కాపాడారు.

గాలెన్ వైక‌ల్యం అంటే ఏమిటి..?

గ‌ర్భ‌స్థ శిశువుల్లో మెద‌డుకు వ‌చ్చే ఈ వ్యాధినే గాలెన్ వైక‌ల్యం అంటారు. మెదడులో పొరలుగా మారిన ధమనులు కేశ నాళికలకు బదులుగా నేరుగా సిరలకు అనుసంధానం అయినప్పుడు ఏర్పడే స్థితినే గాలెన్‌ వైకల్యం అంటారు. దీని కారణంగా మెద‌డు నుంచి గుండెకు రక్త ప్రవాహం నెమ్మదిస్తుంది. తద్వారా రక్తపీడనం ఎక్కువై సిరలపై ప్రభావం పడుతుంది. సిరలలో ఒత్తిడి కారణంగా మెదడు పెరుగుదల మందగించి, కణజాలాలు దెబ్బతింటాయి. శిశువు పుట్టాక మ‌ర‌ణించే అవ‌కాశం ఉంటుంది.

Updated On 5 May 2023 5:10 AM GMT
subbareddy

subbareddy

Next Story