విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన 240 వసతి గదులను రేపు సోమవారం దేవదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా మంత్రి జి.జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ప్రారంభించనున్నట్టు ఈవో గీత తెలిపారు.
దాతల విరాళంతో తులసీ కాటేజ్ ప్రక్కన నిర్మించిన ఈ 240 నూతన గదులలో కొన్ని రూ.12 లక్షల వ్యయంతో, మరికొన్ని రూ.6 లక్షలతో, రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన గదులు ఉన్నాయని వెల్లడించారు. నూతన వసతి గృహ సముదాయం ప్రారంభోత్సవం సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించి తీర్థప్రసాదాలు అందిస్తామని తెలిపారు.