- నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1 భారత్ ఆధిక్యం
- మార్చి 9న అహ్మదాబాద్ వేదికగా చివరి టెస్ట్
IND vs AUS 3rd Test, విధాత: ఇండోర్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border Gavaskar Trophy 2023) మూడో టెస్ట్‌లో భారత్ ఓటమి పాలైంది. భారత్‌పై ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. నాలుగు టెస్టుల సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్నది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 109 పరుగులు, ఆస్ట్రేలియా 197 పరుగులు చేశాయి.
దీంతో ఆస్ట్రేలియా (Australia)కు మొదటి ఇన్నింగ్స్‌లో 88 పరుగుల ఆధిక్యత లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ను 163 పరుగులకే ఆలౌట్ చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 88 ఆధిక్యంతో 76 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారు జట్టు ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది.
The win also locks in our spot for the ICC World Test Championship Final at The Oval in June 💪
— Cricket Australia (@CricketAus) March 3, 2023
స్పిన్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై ఆస్ట్రేలియా (Australia) స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియన్ (Nathan Lyon) చెలరేగి ఏకంగా 8 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. భారత బ్యాటర్లను కట్టడి చేసిన ఆయనకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. భారత్ తన రెండు ఇన్నింగ్స్‌లో 18 వికెట్లు ఆసీస్ స్పిన్నర్లకే సమర్పించడం గమనార్హం.
కానీ భారత స్పిన్నర్లు మాత్రం ఆసీస్ బ్యాటర్లపై ఏమాత్రం ప్రభావం చూపెట్టలేక పోయారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా (Australia) బ్యాట్స్‌మెన్‌లు ఎటాకింగ్ గేమ్ ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. చివరి టెస్ట్ మార్చి 9న అహ్మదాబాద్ వేదికగా ప్రారంభం కానున్నది. మొదటి రెండు టెస్టుల వలె భారత్ ఆస్ట్రేలియాను నిలవరిస్తుందా? లేక పర్యాటక జట్టు భారత్‌పై ఇదే దూకుడు ప్రదర్శించి సిరీస్‌ను సమం చేస్తారా? అన్నది చూడాలి.