Asia Cup 2023 | ఆసియా కప్‌లో టీమిండియా మ్యాచులకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన ప్రతి మ్యాచుకూ వర్షం ఆటంకం కలిగించింది. పాక్‌తో జరిగిన తొలి లీగ్ మ్యాచ్ ఫలితం తేలకుండా రద్దయ్యింది. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో టీమిండియా గెలుపొందింది. తాజాగా సూపర్ ఫోర్‌లో పాక్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌కు సైతం వరుణుడు ఆటంకం కలిగించాయి. అయితే, ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉండగా.. సోమవారం మ్యాచ్ జరుగనున్నది. […]

Asia Cup 2023 |
ఆసియా కప్‌లో టీమిండియా మ్యాచులకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన ప్రతి మ్యాచుకూ వర్షం ఆటంకం కలిగించింది. పాక్‌తో జరిగిన తొలి లీగ్ మ్యాచ్ ఫలితం తేలకుండా రద్దయ్యింది. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో టీమిండియా గెలుపొందింది. తాజాగా సూపర్ ఫోర్‌లో పాక్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌కు సైతం వరుణుడు ఆటంకం కలిగించాయి.
అయితే, ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉండగా.. సోమవారం మ్యాచ్ జరుగనున్నది. అయితే, రిజర్వ్ డే మ్యాచ్ జరుగడం సైతం అనుమానాస్పదంగానే మారింది. కొలంబోలో సోమవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది.
ఆదివారం మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 24.1 ఓవర్లకు గాను 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. అదే సమయంలో భారీ వర్షం కారణంగా మ్యాచ్‌ను నిలిపివేశారు. మళ్లీ ఆట సాగేందుకు అవకాశం లేకపోవడంతో మిగతా మ్యాచ్‌ను రిజర్వ్‌డేకు మార్చారు.
ఎక్కడైతే మ్యాచ్ నిలిచిపోయిందో అక్కడే నుంచి అంటే 24.2 ఓవర్ల నుంచి మొదలవనున్నది. కొలంబోలో సోమవారం సాయంత్రం 5.30 గంటల తర్వాత 80శాతం వర్షం కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ విభాగం పేర్కొంది.
మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. అప్పటి నుంచీ ఏ గంట చూసినా కనీసం 70 శాతం వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు అంచనా. ఈ లెక్కన రిజర్వ్ డే కూడా మ్యాచ్‌కు వర్షం అడ్డుపడితే మొత్తం రద్దయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు సాగిన మ్యాచ్‌లో టీమిండియా పటిష్ట స్థితిలో ఉన్నది. రోహిత్ - గిల్ జోడి అర్ధ సెంచరీలతో చెలరేగి శుభారంభాన్ని అందించారు.
తొలి వికెట్‌కు 121 పరుగులు జోడించారు. పాక్ పేస్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్నారు. చాలా రోజుల తర్వాత బ్యాట్ పట్టి క్రీజులోకి వచ్చిన రాహుల్ 28 బంతుల్లో 17 పరుగులు చేశాడు. సోమవారం జరిగే మ్యాచ్‌లో మరిన్ని పరుగులు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
