IND vs PAK | చిరకాల ప్రత్యర్థి పాక్‌ను టీమిండియా మట్టికరిపించింది. ఆసియాకప్ సూపర్-4లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో దయాది దేశంపై 228 పరుగులు భారీ విజయాన్ని నమోదు చేసింది. రిజర్వ్ డేలో బ్యాటింగ్‌తో పాట బౌలింగ్‌లోనూ చిత్తు చేసింది. అయితే, రిజర్వ్ డే మ్యాచ్‌లోనూ పలుసార్లు వరుణుడు మ్యాచ్‌కు ఆటంకం కలిగించినా.. చివరకు మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలో పాక్‌పై టీమిండియాకు ఇదే పరుగుల పరంగా అతిపెద్ద విజయం సాధించి. రోహితసేన […]

IND vs PAK |
చిరకాల ప్రత్యర్థి పాక్‌ను టీమిండియా మట్టికరిపించింది. ఆసియాకప్ సూపర్-4లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో దయాది దేశంపై 228 పరుగులు భారీ విజయాన్ని నమోదు చేసింది. రిజర్వ్ డేలో బ్యాటింగ్‌తో పాట బౌలింగ్‌లోనూ చిత్తు చేసింది. అయితే, రిజర్వ్ డే మ్యాచ్‌లోనూ పలుసార్లు వరుణుడు మ్యాచ్‌కు ఆటంకం కలిగించినా.. చివరకు మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలో పాక్‌పై టీమిండియాకు ఇదే పరుగుల పరంగా అతిపెద్ద విజయం సాధించి. రోహితసేన సరికొత్త రికార్డును నెలకొల్పింది.
పరుగుల వరద..
మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 356 పరుగులు సాధించింది. ఓపెనర్లు రోహిత్, శుభ్‌మన్ గిల్ శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (122 నాటౌట్), కేఎల్ రాహుల్ (111 నాటౌట్) పరుగుల వరద పారించారు. ఇద్దరు మరో వికెట్ పడకుండా ఆడుతూ సెంచరీలతో అజేయంగా నిలిచారు. ఆ తర్వాత 357 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 32 ఓవర్లలో 128 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.
గాయపడిన నసీమ్ షా, హరిస్ రవూఫ్ బ్యాటింగ్‍కు దూరమయ్యారు. దీంతో పాక్ ఆలౌట్ అయినట్లుగా అంపైర్లు పరిగణలోకి తీసుకున్నారు. అయితే, భారత స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ (5/25) పాకిస్థాన్‍ను కుప్పకూల్చాడు. జస్‍ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్‌కు తలో వికెట్ దక్యింది. పాక్ బ్యాటర్లలో ఒక్కరు సైతం 30 పరుగులు సాధించలేకపోయారు. ఫకర్ జమాన్ (27) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
భారత్ బ్యాటింగ్ సూపర్..
సూపర్-4లో భాగంగా భారత్-పాక్ మధ్య ఆదివారం శ్రీలంకలో కొలంబో స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పాక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారతత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ (56), శుభ్‍మన్ గిల్ (58) అర్ధ శతకాలతో రాణించడంతో టీమిండియాకు శుభారంభం అందించినట్లయ్యింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చారు. 24.1 ఓవర్లకు టీమిండియా 2 వికెట్లకు 147 పరుగులు సాధించింది. అదే సమయంలో భారీ వర్షం కురవడంతో మ్యాచ్ వాయిదా పడింది.
రిజర్వ్‌డే అయిన సోమవారం కూడా వర్షం కారణంగా ఆట ఆలస్యంగా మొదలైంది. విరాట్ - రాహుల్ జోడీ ఆచితూడి ఆడుతూనే.. దూకుడు పెంచారు. వికెట్లు పడకుండా పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. గాయం నుంచి కొలుకున్న రాహుల్ ఈ బ్యాచ్‌లో బరిలోకి దిగి సెంచరీ సాధించాడు. 100 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అలాగే విరాట్ సైతం 84 బంతుల్లో సెంచరీ చేశాడు. వన్డేల్లో 47వ శతకాన్ని నమోదు చేశాడు. 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి భారత్ 356 పరుగులు చేసింది. విరాల్ - కేఎల్ రాహుల్ జోడీ రెండో అజేయంగా 233 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
పాక్ వెన్ను విరిచిన కుల్‌దీప్
కొండండ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. బౌలింగ్ దాటికి పాక్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. పేసర్లు జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా స్వింగ్ బౌలింగ్‌తో బెంబేలెత్తించారు. ఇమాముల్ హక్ (9)ను బుమ్రా ఔట్ చేయగా.. బాబర్ ఆజమ్ (10)ను పాండ్యా క్లీన్ బౌల్డ్ చేశాడు. మహమ్మద్ రిజ్వాన్(2)ను శార్దూల్ ఠాకూర్ పెవిలియన్‌కు చేర్చాడు. 11.4 ఓవర్లలో పాక్ 47 పరుగులకు 3 వికెట్లను కోల్పోయింది.
ఆ తర్వాత బౌలింగ్‌కు వచ్చిన కుల్‌దీప్ యాదవ్ పాక్‌ను వణికించాడు. అప్పటి వరకు నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న ఫకర్ జమాన్ (27)ను తొలుత పెవిలియన్‌కు పంపిన కుల్‌దీప్.. 24 ఓవర్‌లో అఘ సల్మాన్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత షాదాబ్ ఖాన్ (6) ఇఫ్తికార్ అహ్మద్ (23), ఫహీమ్ అష్రఫ్ (4) అవుట్ చేసి పాక్ వెన్ను విరిచాడు. హరిస్ రవూఫ్, ససీమ్ షా గాయపడడంతో బ్యాటింగ్‍కు రాలేదు. దీంతో 32 ఓవర్లలో 128 పరుగులకే పరిమితమైంది. 228 పరుగుల తేడాతో భారత్ గెలిచింది.
