Ind vs Pak | భారత్- పాక్ మ్యాచ్ అంటే క్రికెట్ ప్రేమికులకి మంచి మజా దొరకడం ఖాయం. ఆసియా కప్ 2023లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 10న జరగాల్సి ఉండగా, ఈ సూపర్-4 మ్యాచ్‌ను కూడా వర్షం అడ్డుకోవడంతో ఆటను రిజర్వ్ డేకు వాయిదా వేశారు. అంతకముందు రోజు జరిగిన ఆటలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ (56), శుభ్‌మన్ గిల్ (58) ఇద్దరూ దూకుడుగా ఆడారు. దీంతో పాక్ బౌలర్లు ఆత్మరక్షణలో పడిపోయారు. […]

Ind vs Pak |
భారత్- పాక్ మ్యాచ్ అంటే క్రికెట్ ప్రేమికులకి మంచి మజా దొరకడం ఖాయం. ఆసియా కప్ 2023లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 10న జరగాల్సి ఉండగా, ఈ సూపర్-4 మ్యాచ్‌ను కూడా వర్షం అడ్డుకోవడంతో ఆటను రిజర్వ్ డేకు వాయిదా వేశారు. అంతకముందు రోజు జరిగిన ఆటలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ (56), శుభ్‌మన్ గిల్ (58) ఇద్దరూ దూకుడుగా ఆడారు. దీంతో పాక్ బౌలర్లు ఆత్మరక్షణలో పడిపోయారు.
అయితే రోహిత్, గిల్ ఇద్దరూ వరుస ఓవర్లలో అవుటవడంతో టీమిండియాపై కొంత ఒత్తిడి ఏర్పడింది. ఇలాంటి సమయంలో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ కలిసి ఇన్నింగ్స్ నిర్మించారు. కోహ్లీ, రాహుల్ ఇద్దరు కూడా సెంచరీలు చేయడంతో భారత్ భారీ లక్ష్యాన్ని పాక్ ముందు ఉంచింది.
అయితే ఈ రోజు బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ (122 నాటౌట్), కేఎల్ రాహుల్ (111 నాటౌట్) మొదట్లో చాలా నిధానంగా ఆడారు. కాని తర్వాత గేర్ మార్చారు. 55 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ, 84 బంతుల్లో సెంచరీ అందుకోవడం విశేషం.
ఈ క్రమంలో వన్డేల్లో 267 ఇన్నింగ్స్‌ల్లో 47వ సెంచరీ అందుకున్నాడు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఇక ఈ మ్యాచ్‌తో 13వేల పరుగుల మార్క్ కూడా చేరుకున్నాడు. ఇక కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకొని ఆరు నెలల తర్వాత టీమిండియాలోకి వచ్చి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 100 బంతుల్లోనే సెంచరీ మార్కుకు చేరిన పాండ్యా తన సత్తా చూపించాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ (122 నాటౌట్), కేఎల్ రాహుల్ (111 నాటౌట్) అజేయ శతకాలతో చెలరేగటంతో టీమిండియా 50 ఓవర్లలో 2 వికెట్లకు 356 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక 357 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌కి బుమ్రా తొలి దెబ్బ కొట్టాడు. పాకిస్థాన్ ఓపెనర్ ఇమాముల్ హక్ (9) వికెట్ భారత పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా తీయడంతో 17 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది పాక్.
అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్(10)ను భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బౌల్డ్ చేశాడు. ఇక 11 ఓవర్లలో 2 వికెట్లకు 44 పరుగులే చేసి కష్టాల్లో ఉన్న సమయంలో మరోసారి ఆటకి వర్షం అంతరాయం కలిగించింది. ప్రస్తుతం క్రీజులో ఫకర్ జమాన్ (14 నాటౌట్) మహమ్మద్ రిజ్వాన్ (1) ఉన్నారు. మరి ఈ రోజైన మ్యాచ్ జరుగుతుందో లేదో చూడాలి.
