Ind vs SL | ఆసియా కప్‌-2023 సూపర్‌ ఫోర్‌లో భాగంగా టీమిండియా నేడు శ్రీలంకతో తలపడనున్నది. టీమిండియాతో వరుసగా మూడోరోజు బరిలోకి దిగుతుండడం విశేషం. పాక్‌తో వర్షం కారణంగా రెండు రోజులు మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. మూడోరోజు రెస్ట్‌ లేకుండా బరిలోకి దిగబోతున్నది. పాక్‌పై అజేయ విజయంతో మంచి జోరుమీదున్న టీమిండియా.. శ్రీలంకపై గెలిచి ఫైనల్‌ బెర్తు ఖాయం చేసుకోవాలని చూపిస్తున్నది. సూపర్‌-4 మ్యాచ్‌లో కొలంబో వేదికగా జరుగనున్నది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం […]

Ind vs SL |

ఆసియా కప్‌-2023 సూపర్‌ ఫోర్‌లో భాగంగా టీమిండియా నేడు శ్రీలంకతో తలపడనున్నది. టీమిండియాతో వరుసగా మూడోరోజు బరిలోకి దిగుతుండడం విశేషం. పాక్‌తో వర్షం కారణంగా రెండు రోజులు మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. మూడోరోజు రెస్ట్‌ లేకుండా బరిలోకి దిగబోతున్నది.

పాక్‌పై అజేయ విజయంతో మంచి జోరుమీదున్న టీమిండియా.. శ్రీలంకపై గెలిచి ఫైనల్‌ బెర్తు ఖాయం చేసుకోవాలని చూపిస్తున్నది. సూపర్‌-4 మ్యాచ్‌లో కొలంబో వేదికగా జరుగనున్నది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డుపడడం ఖాయంగా కనిపిస్తుండగా.. రిజర్వ్‌ డే ఉన్నా మ్యాచ్‌కు లేకపోవడంతో మ్యాచ్ రద్దయితే రెండు జట్లకు చెరో పాయింట్‌ ఇవ్వనున్నారు.

90 శాతం వర్ష సూచన..

శ్రీలంక కొలంబోలో వర్షాలు కొనసాగే పరిస్థితి నెలకొన్నది. ఇప్పట్లో వార్త మెరుగయ్యేలా కనిపించడం లేదు. భారత్‌ - శ్రీలంక మ్యాచ్ జరిగే మంగళవారం సైతం 90శాతం వర్షం పడే అవకాశాలున్నాయి. టాస్ సమయంలోనూ 60శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

కొలంబో 92శాతం మేఘావృతమై ఉండనున్నది. గాల్లో తేమ శాతం 77శాతంగా ఉండనుండగా.. ఉక్కపోత కూడా అధికంగానే ఉంటుంది. ప్రస్తుతం సూపర్ ఫోర్‌ పాయింట్ల టేబుల్‌లో భారత్‌ - శ్రీలంక తొలి రెండుస్థానాల్లో ఉన్నాయి. పాకిస్థాన్‌పై రికార్డు విజయంతో భారత్‌ ఏకంగా 4.520 నెట్‌ రన్‌రే‌ట్‌తో టాప్‌లో ఉండగా.. శ్రీలంక 0.42 నెట్ రన్‌రేట్‌తో రెండో స్థానంలో ఉన్నది.

లంకను తక్కువ అంచనా వేయలేం..

సూపర్ ఫోర్‌ తొలిమ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై శ్రీలంక విజయం సాధించింది. స్వదేశంలో పరిస్థితుల్లో లంక జట్టును తక్కువగా అంచనా వేయలేం. అక్కడి పరిస్థితులు ఆ జట్టుకు తగినట్టుగా రాణించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో టీమిండియా జట్టు లంకతో కాస్త ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే భారత్‌ ఫైనల్‌కు మార్గం సుగమమం అవుతుంది.

అయితే, ఈ మ్యాచ్‌ రద్దయితే పాక్‌కు ఇబ్బందికరంగా మారనుండగా.. లంకపై ఇండియా గెలువాలని పాక్‌ కోరుకుంటుంది. సూపర్‌-4లో పాయింట్ల పట్టికలో భారత్, శ్రీలంక, పాక్‌ రెండేసి పాయింట్లో ఉండగా.. నెట్‌రన్‌రేట్‌ పరంగా టీమిండియా మెరుగ్గా ఉన్నది. భారత్‌ తర్వాత శ్రీలంక రెండో స్థానంలో ఉండగా.. పాక్‌ మూడోస్థానంలో ఉన్నది.

Updated On 12 Sep 2023 6:07 AM GMT
cm

cm

Next Story