INDIA Alliance విధాత : కేంద్రంలోని బీజేపీని గద్దె దించే లక్ష్యంతో ఇండియా కూటమి పేరుతో ఒక్కటైన విపక్షాలు ఉమ్మడి కార్యాచరణ అమలు చేసే దిశగా ఆదిలోనే అవాంతరాలు ఎదుర్కోంటున్నారు. ఇండియా కూటమి వచ్చే ఆక్టోబర్ నెల మొదటి వారంలో మధ్యప్రదేశ్ భోపాల్‌లో నిర్వహించ తలపెట్టిన తొలి బహిరంగ సభను అనూహ్యంగా రద్దు చేసుకుంది. ఇటీవల ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో ఇండియా కూటమి సమన్వయ కమిటీ భేటీలో త్వరలో ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్ రాష్ట్రం […]

INDIA Alliance
విధాత : కేంద్రంలోని బీజేపీని గద్దె దించే లక్ష్యంతో ఇండియా కూటమి పేరుతో ఒక్కటైన విపక్షాలు ఉమ్మడి కార్యాచరణ అమలు చేసే దిశగా ఆదిలోనే అవాంతరాలు ఎదుర్కోంటున్నారు. ఇండియా కూటమి వచ్చే ఆక్టోబర్ నెల మొదటి వారంలో మధ్యప్రదేశ్ భోపాల్‌లో నిర్వహించ తలపెట్టిన తొలి బహిరంగ సభను అనూహ్యంగా రద్దు చేసుకుంది. ఇటీవల ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో ఇండియా కూటమి సమన్వయ కమిటీ భేటీలో త్వరలో ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లో తొలి బహిరంగ సభ నిర్వాహించాలని నిర్ణయించారు.
కాగా.. సభలో కేంద్రంపై దాడిలో భాగంగా పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, అవినీతి, కులగణన అంశాలపై ప్రజల్లో మోడీ ప్రభుత్వాన్ని, మధ్యప్రదేశ్‌లోని అధికార బీజేపీ సర్కారును ఎండగట్టాలని నిర్ణయించింది. అయితే ఈ బహిరంగ సభను రద్దు చేసినట్లుగా మధ్యప్రదేశ్ మాజీ సీఎం, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ శనివారం వెల్లడించారు. భోపాల్ లో ఇండియా కూటమి ర్యాలీ, సభ రద్దు చేసినట్లుగా మీడియాకు తెలిపారు.
అనంతరం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్వేవాలా స్పందిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే బహిరంగ సభ నిర్వాహణపై కూటమి పార్టీలతో చర్చిస్తున్నారని, ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలన్నదానిపై తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. మొత్తం మీద ఇండియా కూటమి భోపాల్ సభ రద్ధు కావడంతో ఇదే అదనుగా బీజేపీ ఆ కూటమిపై సెటైర్లతో విమర్శలు గుప్పిస్తుంది.
మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ కూటమికి బలమైన నాయకత్వం లేదని, లుకలుకలతో ఉందన్నారు. సనాతన ధర్మాన్ని అవమానించినందుకు ప్రజలు ప్రతిపక్షాల కూటమిపై ఆగ్రహంగా ఉన్నారని, అందుకే ఆ కూటమి వారి సభను రద్ధు చేసుకుందని విమర్శించారు. సనాతన ధర్మాన్ని అవమానించే వారిని ప్రజలు సహించరని, ప్రజాగ్రహానికి కూటమి భయపడి సభను రద్ధు చేసుకుందని ఎద్దేవా చేశారు. కూటమి పార్టీలకు ప్రజలు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారన్నారు.
