Bharat | ఇండియా.. ఈ పేరు ప్ర‌పంచ దేశాల‌కు సుప‌రిచితం. అయితే ఈ ఇండియా ఇక భార‌త్‌గా మార‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఇండియాను భార‌త్‌గా పిల‌వాల‌ని కేంద్రం నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఇందుకు రాజ్యాంగాన్ని స‌వ‌రించి తీర్మానం చేసేందుకు కేంద్రం సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల‌తో ఇప్పుడు ఊహాగానాలు జోరందుకున్నాయి. అస‌లేం జ‌రిగిందంటే.. భార‌త్ అధ్య‌క్ష‌త‌న ఈ వారాంతంలో జీ-20 శిఖ‌రాగ్ర స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది. అయితే ఈ స‌మావేశానికి ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు […]

Bharat |

ఇండియా.. ఈ పేరు ప్ర‌పంచ దేశాల‌కు సుప‌రిచితం. అయితే ఈ ఇండియా ఇక భార‌త్‌గా మార‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఇండియాను భార‌త్‌గా పిల‌వాల‌ని కేంద్రం నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఇందుకు రాజ్యాంగాన్ని స‌వ‌రించి తీర్మానం చేసేందుకు కేంద్రం సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల‌తో ఇప్పుడు ఊహాగానాలు జోరందుకున్నాయి.

అస‌లేం జ‌రిగిందంటే..

భార‌త్ అధ్య‌క్ష‌త‌న ఈ వారాంతంలో జీ-20 శిఖ‌రాగ్ర స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది. అయితే ఈ స‌మావేశానికి ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాల అధినేత‌లు, అధ్య‌క్షులు, ప్ర‌ధాన‌మంత్రులు హాజ‌రు కానున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌పంచ దేశాల అధినేత‌ల‌కు రాష్ట్ర‌ప్ర‌తి ద్రౌప‌ది ముర్ము ఈ నెల 9వ తేదీన ప్ర‌త్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఆహ్వానించే లేఖ‌ల‌పై ది ప్రెసిడెంట్ ఆఫ్ భార‌త్ అని రాసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని రాసేవారు. కానీ ది ప్రెసిడెంట్ ఆఫ్ భార‌త్ పేరిట అతిథుల‌కు ఆహ్వాన లేఖ‌లు అందాయి.

అయితే జీ-20 స‌ద‌స్సు కోసం రూపొందించిన బుక్‌లెట్‌ లోనూ దేశం పేరు భార‌త్ అని పేర్కొన్నారు. భార‌త్, మ‌ద‌ర్ ఆఫ్ డెమోక్ర‌సీ అని అందులో రాశారు. ఆంగ్లంలోనూ ఇండియా నుంచి భార‌త్‌గా పేరు మారుస్తూ ప్ర‌ధాని మోదీ స‌ర్కార్ ప్ర‌త్యేక తీర్మానం తీసుకురానున్న‌ట్లు వార్త‌లు షికారు చేస్తున్నాయి. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వ‌ర‌కు జ‌రిగే పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాల్లో ఈ ప్ర‌తిపాద‌న తీసుకురానున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

ఈ లేఖ‌ల‌పై కాంగ్రెస్ తీవ్ర విమ‌ర్శ‌లు..

ద్రి ప్రెసిడెంట్ ఆఫ్ భార‌త్ అని రాసి ఉన్న లేఖ‌ల‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమ‌ర్శ‌లు చేసింది. జీ 20 విందు కోసం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బ‌దులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భార‌త్ అనే పేరుతో రాష్ట్రప‌తి భ‌వ‌న్ ఆహ్వానం పంపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్-1లో ఇంత‌కు ముందు ఇండియా, అది భార‌త్ అని ఉంటుంది.

కానీ ఇప్పుడు మోదీ స‌ర్కార్ వ‌ల్ల దీన్ని.. భార‌త్, అది ఇండియా, రాష్ట్రాల స‌మాఖ్య అని చ‌ద‌వాలి. ఇది రాష్ట్రాల స‌మాఖ్య‌పైనా జ‌రుగుతున్న దాడి అని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జైరాం ర‌మేశ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ధ్వ‌జ‌మెత్తారు. దేశ చ‌రిత్ర‌ను నాశ‌నం చేయ‌డాన్ని మోదీ కొన‌సాగిస్తున్నార‌ని ర‌మేశ్ మండిప‌డ్డారు.

Updated On 5 Sep 2023 10:36 AM GMT
krs

krs

Next Story