స్మ‌గ్లింగ్ ఇన్ ఇండియా నివేదిక‌లో వెల్ల‌డి విధాత‌: డ‌గ్స్‌కు కుంద్రంగా భార‌త్ మారుతుందా? అన్న‌సందేహాలు స‌ర్వ‌త్రా వెలువ‌డుతున్నాయి. ఏటి కేడు దేశంలో మ‌త్తు వినియోగం పెరుగున్న‌ట్లు తెలుస్తుంది. స్మ‌గ్లింగ్ ఇన్ ఇండియా 2021-22 నాటికి కేంద్రం విడుద‌ల చేసిన నివేదిక‌లో భార‌త్‌లో 34 వేల 5 కిలోల పైగా డ్ర‌గ్స్ స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం దేశంలో ప‌ట్టుబ‌డిన మాద‌క ద్ర‌వ్యాలు, అక్ర‌మ ఆయుధాల‌పై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ‌శాఖ నివేదిక విడుద‌ల చేసింది. […]

  • స్మ‌గ్లింగ్ ఇన్ ఇండియా నివేదిక‌లో వెల్ల‌డి

విధాత‌: డ‌గ్స్‌కు కుంద్రంగా భార‌త్ మారుతుందా? అన్న‌సందేహాలు స‌ర్వ‌త్రా వెలువ‌డుతున్నాయి. ఏటి కేడు దేశంలో మ‌త్తు వినియోగం పెరుగున్న‌ట్లు తెలుస్తుంది. స్మ‌గ్లింగ్ ఇన్ ఇండియా 2021-22 నాటికి కేంద్రం విడుద‌ల చేసిన నివేదిక‌లో భార‌త్‌లో 34 వేల 5 కిలోల పైగా డ్ర‌గ్స్ స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం దేశంలో ప‌ట్టుబ‌డిన మాద‌క ద్ర‌వ్యాలు, అక్ర‌మ ఆయుధాల‌పై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ‌శాఖ నివేదిక విడుద‌ల చేసింది.

2021-22 ఆర్థిక సంవ‌త్సంలో దేశ వ్యాప్తంగా రూ.17.394.56 కోట్ల విలువైన మాద‌క ద్ర‌వ్యాలను క‌స్ట‌మ్స్ అధికారులు స్వాధీనం చేసుకోగా, రూ. 20 వేల కోట్ల పైచిలుకు మాదక ద్ర‌వ్యాల‌ను రెవెన్యూ ఇంటిలిజెన్స్ విభాగం స్వాధీనం చేసుకున్న‌ట్లు నివేదించింది. అలాగే రూ.1323.23 కోట్ల విలువైన బంగారం, రూ. 58.28 విదేశీ నగదు పట్టుబడినట్లు ఈ నివేదికలో పేర్కొన్న‌ది.

అయితే రెవెన్యూ ఇంటిలిజెన్స్‌ విభాగం నిర్వహించిన దాడులు, చేపట్టిన ఆపరేషన్లలో అధికంగా ఆంధ్రప్రదేశ్‌లో మాద‌క ద్ర‌వ్యాలు లభ్యం అయినట్లు నివేదిక తెలిపింది. ఏపీలో 18,267 కేజీల మాదక ద్రవ్యాలను కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్న‌ది.

దేశంలోని ఇత‌ర రాష్ట్రాల కంటే అత్యధికంగా ఏపిలోనే డ్రగ్స్‌, నార్కొటిక్స్ కేంద్ర బ‌ల‌గాలు స్వాధీనం చేసుకున్నట్లు నివేదించింది. 1,057 కేజీల గంజాయి, రూ. 97 కోట్ల విలువైన 165 టన్నుల ఎర్రచందనం కూడా స్వాధీనం చేసుకున్నట్లు నివేదిక పేర్కొన్న‌ది. తెలంగాణలో 1012 కేజీల మాదక ద్రవ్యాలు, మత్తు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.

Updated On 5 Dec 2022 10:57 AM GMT
krs

krs

Next Story