విధాత, క్రికెట్: భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 ప్రారంభమైంది. గురువారం రాత్రి వర్షం కారణంగా నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ వేదిక చిత్తడిగా మారింది. గ్రౌండ్స్‌మెన్ మైదానాన్ని సిద్ధం చేసినప్పటికీ అక్కడక్కడ తేమ ఎక్కువగా ఉండడంతో టాస్ వాయిదా పడింది. చివరికి 9.15 గంటలకు టాస్ పడింది. టీమిండియా సారథి రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా, భారత జట్లు రెండేసి మార్పులతో బరిలోకి దిగింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 8 ఓవర్లో […]

విధాత, క్రికెట్: భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 ప్రారంభమైంది. గురువారం రాత్రి వర్షం కారణంగా నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ వేదిక చిత్తడిగా మారింది.
గ్రౌండ్స్‌మెన్ మైదానాన్ని సిద్ధం చేసినప్పటికీ అక్కడక్కడ తేమ ఎక్కువగా ఉండడంతో టాస్ వాయిదా పడింది. చివరికి 9.15 గంటలకు టాస్ పడింది.
టీమిండియా సారథి రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా, భారత జట్లు రెండేసి మార్పులతో బరిలోకి దిగింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 8 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. వేడ్(43 నాటౌట్), ఫించ్(31) చెలరేగారు
భారత్ విజయ లక్ష్యం 48 బంతుల్లో 91 పరుగులు చేయాల్సి ఉండగా. భారత్ కూడా ధాటి గానే ఆట ప్రారంభించింది. 91 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన భారత్ 4 వికెట్లు కోల్పోయి 7.2 ఓవర్లలో విజయం సాధించింది.
రోహిత్ శర్మ(46 నాటౌట్) వీరవిహారం చేశాడు. ఈ విజయంతో భారత్ సిరీస్1-1తో సమం చేసింది. చివరి మ్యాచ్ ఈనెల 25న హైదరాబాద్‌లో జరగనుంది.
