7 వికెట్ల తేడాతో ఫైనల్లో ఇంగ్లండ్ జట్టును చిత్తు చేసిన షఫాలి సేన ఆల్ రౌండ్ నైపుణ్యంతో టీమ్ ఇండియా ఈజీ విక్టరీ విధాత: భారత యువ మహిళా జట్టు అద్భుతం చేసింది. అండర్ 19 విభాగంలో తొలిసారిగా నిర్వహించిన ప్రపంచకప్ విజేతగా నయాచరిత్ర నమోదు చేసింది. సీనియర్ జట్టు ప్లేయర్ గా తన అనుభవాన్ని మేళవించి.. యువ జట్టు కెప్టెన్ గా షఫాలీవర్మ టీమ్ ఇండియాను చాంపియన్ గా నిలిపింది. లీగ్ దశలో ఒక్క ఆస్ట్రేలియా […]

  • 7 వికెట్ల తేడాతో ఫైనల్లో ఇంగ్లండ్ జట్టును చిత్తు చేసిన షఫాలి సేన
  • ఆల్ రౌండ్ నైపుణ్యంతో టీమ్ ఇండియా ఈజీ విక్టరీ

విధాత: భారత యువ మహిళా జట్టు అద్భుతం చేసింది. అండర్ 19 విభాగంలో తొలిసారిగా నిర్వహించిన ప్రపంచకప్ విజేతగా నయాచరిత్ర నమోదు చేసింది. సీనియర్ జట్టు ప్లేయర్ గా తన అనుభవాన్ని మేళవించి.. యువ జట్టు కెప్టెన్ గా షఫాలీవర్మ టీమ్ ఇండియాను చాంపియన్ గా నిలిపింది. లీగ్ దశలో ఒక్క ఆస్ట్రేలియా జట్టుపై మాత్రమే ఓడిన షఫాలి సేన.. టోర్నీ ఆద్యంతం అద్భుత విజయాలను నమోదు చేసింది. సెమీస్ లో న్యూజిలాండ్ నూ సునాయాసంగా ఓడించిన టీమ్ ఇండియా ..ఫైనల్లోనూ అదే జోరుతో ఇంగ్లండ్ యువజట్టును ఓడించి చాంపియన్ గా నిలువడం విశేషం..

తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు భారత యువ బౌలర్ల ధాటికి 17.1 ఓవర్లలో కేవలం 68 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ జట్టులో ర్యానా మెక్ డొనాల్డ్ చేసిన 19 పరుగులే అత్యధిక స్కోరు. ఇంగ్లండ్ బ్యాటర్లలో నిమా హాలండ్ 10, అలెక్సా స్టోన్ హౌస్ 11 రన్స్ మాత్రమే చేయగలిగారు.

భారత యువ బౌలర్లలో సాధు(4 ఓవర్లలో 6/2) నిర్ణీత ఓవర్ల కోటాలో 6 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టగా.. అర్చనా దేవి(17/2), చోప్రా(13/2) అద్భుత బౌలింగ్ తో ఇంగ్లండ్ బ్యాటర్లను వణికించారు. వీరికి తోడుగా మనన్ కశ్యప్ , కెప్టెన్ షఫాలీవర్మ, సోనమ్ ముకేశ్ యాదవ్ తలో వికెట్ పడగొట్టాడు. దీంతో ఇంగ్లండ్ కేవలం 68 పరుగులకే ఆలౌటైంది.

అనంతరం 69 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా.. 14 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 69 పరుగులు చేసి ఆడుతూపాడుతూ ఘన విజయంతో ప్రపంచ చాంపియన్ గా నిలిచింది.

భారత బ్యాటర్లలో కెప్టెన్ షఫాలీ వర్మ (15), శ్వేత(5), సౌమ్య తివారి(24 నాటౌట్), తెలంగాణ బ్యాటర్ త్రిష(24) పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇంగ్లండ్ బౌలర్లలో హన్నా బేకర్, గ్రేస్, అలెక్సా తలో వికెట్ పడగొట్టారు.

ఆల్ రౌండ్ నైపుణ్యంతో అదరగొట్టిన భారత యువ మహిళల జట్టు తొలిసారిగా నిర్వహించిన అండర్ 19 ప్రపంచకప్ లో చాంపియన్‌గా నిలిచి తొలి టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన ధోనీ సేనను గుర్తుకు తెచ్చింది.
సంక్షిప్త స్కోరు ( ఇంగ్లండ్:17.1 ఓవర్లలో 68 ఆలౌట్: భారత్ : 14 ఓవర్లలో 3 వికెట్లకు 69)

Updated On 29 Jan 2023 2:49 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story