Wednesday, March 29, 2023
More
    HomelatestColonel Geeta Rana | చరిత్ర సృష్టించిన కర్నల్‌ గీతా రాణా..! తూర్పు లద్దాఖ్‌లో ఫీల్డ్‌...

    Colonel Geeta Rana | చరిత్ర సృష్టించిన కర్నల్‌ గీతా రాణా..! తూర్పు లద్దాఖ్‌లో ఫీల్డ్‌ వర్క్‌షాప్‌కు నాయకత్వం వహించనున్న తొలి మహిళా అధికారిగా రికార్డు..!

    Colonel Geeta Rana | ఇండియన్ ఆర్మీకి చెందిన కార్ప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్ కల్నల్ గీతా రాణా చరిత్ర సృష్టించారు. తూర్పు లద్దాఖ్‌లోని ఫార్వర్డ్‌, రిమోట్‌ ఏరియాలోని ఫీల్డ్ వర్క్‌షాప్‌కు నాయకత్వం వహించనున్న భారత సైన్యానికి చెందిన తొలి మహిళా అధికారిగా నిలిచారు. ఇటీవల భారత సైతన్యం మహిళా అధికారులను సైతం కమాండర్లుగా నియమించేందుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఘనత సాధించిన తొలి మహిళా అధికారిగా కల్నల్ గీత నిలిచారు. చైనా సరిహద్దు వెంబడి మోహరించిన ఇండిపెండెంట్ ఫీల్డ్ వర్క్‌షాప్‌కు కల్నల్ గీతా నాయకత్వం వహించనున్నారు.

    ఇదిలా ఉండగా.. ఇంజినీర్స్, ఆర్డినెన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ మెకానికల్ ఇంజినీర్‌లతో సహా ఇతర శాఖల స్వతంత్ర యూనిట్లకు మహిళలు త్వరలో నాయకత్వం వహించనున్నారు. రాబోయే రోజులు మరికొంత మంది మహిళా సైనిక అధికారులను నియమించే అవకాశం ఉంది. బోర్డుల నుంచి ఆమోదం లభిస్తే మహిళా అధికారులకు సైతం కమాండర్‌ రోల్స్‌తో పాటు భవిష్యత్‌లో ఉన్నత స్థానాల్లోనూ నియమించే అవకాశాలున్నాయి. ఇటీవల సైన్యం మహిళలకు ప్రాధాన్యం పెరిగింది. సైనిక అధికారులను సైతం శాంతి భద్రతల విషయంలోనూ మోహరిస్తున్నారు. మరో వైపు ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ పాండే సైతం మహిళా అధికారులకు అవకాశాలిచ్చేందుకు అనుకూలంగానే ఉన్నారు. త్వరలోనే ఆర్మీలోని ఆర్టిలరీ రెజిమెంట్‌లోనూ మహిళా సైనిక సిబ్బందిని నియమించే సూచనలున్నాయి. ఈ మేరకు ఆర్మీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సైతం కేంద్రానికి పంపారు.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular