విధాత: భార‌త‌దేశ‌పు తొలి ఓట‌రు శ్యాం శ‌ర‌ణ్ నేగి(106) క‌న్నుమూశారు. 1951 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 34 సార్లు త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ కిన్నూరుకు చెందిన శ్యాం శ‌ర‌ణ్ నేగి.. భార‌త‌దేశ‌పు తొలి ఓట‌రుగా రికార్డులోకి ఎక్కారు. అయితే న‌వంబ‌ర్ 12న జ‌ర‌గ‌బోయే హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈ నెల 2వ తేదీన పోస్ట‌ల్ బ్యాలెట్ ద్వారా త‌న ఓటు హ‌క్కును చివ‌రిసారిగా వినియోగించుకున్నారు. శ్యాం శ‌ర‌ణ్ మృతి ప‌ట్ల ప్ర‌ధాని […]

విధాత: భార‌త‌దేశ‌పు తొలి ఓట‌రు శ్యాం శ‌ర‌ణ్ నేగి(106) క‌న్నుమూశారు. 1951 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 34 సార్లు త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ కిన్నూరుకు చెందిన శ్యాం శ‌ర‌ణ్ నేగి.. భార‌త‌దేశ‌పు తొలి ఓట‌రుగా రికార్డులోకి ఎక్కారు.

అయితే న‌వంబ‌ర్ 12న జ‌ర‌గ‌బోయే హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈ నెల 2వ తేదీన పోస్ట‌ల్ బ్యాలెట్ ద్వారా త‌న ఓటు హ‌క్కును చివ‌రిసారిగా వినియోగించుకున్నారు. శ్యాం శ‌ర‌ణ్ మృతి ప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు. ప్ర‌భుత్వ అధికారిక లాంఛ‌నాల‌తో నేగి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు.

దేశంలోనే తొలి ఓటరు.. మరోసారి ఓటేసేందుకు సిద్ధమైన 106 ఏండ్ల వృద్ధుడు

శ్యాం శ‌ర‌ణ్ నేగి 1917, జులై 1వ తేదీన జన్మించారు. ఆయ‌న స్కూల్ టీచ‌ర్‌గా ప‌ని చేసి ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. 1951లో తొలిసారిగా జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్‌లో ఓటేశారు. అప్ప‌టి నుంచి హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో జ‌రిగిన ప్ర‌తి ఎన్నిక‌లో ఓటు వేసి, ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ప్రేర‌ణ‌గా నిలిచారు. మొత్తంగా 34 సార్లు త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

Updated On 5 Nov 2022 8:55 AM GMT
krs

krs

Next Story