విధాత‌, న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి ఘోర ప్రమాద తప్పింది. విమానం టేకాఫ్ అవుతుండగా దాని ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన వెనుక ఉన్న పైలట్‌ సమాచారం ఇవ్వడంతో విమానాన్ని అత్యవసరంగా దించేశారు. అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులను, సిబ్బందిని విమానం నుంచి కిందకు దించివేశారు. IndiGo flight 6E-2131 Delhi to Bangalore while take off at the Delhi airport tonight. BTW I’m also […]

విధాత‌, న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి ఘోర ప్రమాద తప్పింది. విమానం టేకాఫ్ అవుతుండగా దాని ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన వెనుక ఉన్న పైలట్‌ సమాచారం ఇవ్వడంతో విమానాన్ని అత్యవసరంగా దించేశారు. అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులను, సిబ్బందిని విమానం నుంచి కిందకు దించివేశారు.

ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన 6ఈ-2131 విమానం 177 మందితో 6ఈ-2131 ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్నది. రన్‌వైపై టేక్‌ఆఫ్‌ అవుతుండగా విమానం ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. గమనిం చిన పైలట్‌ విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశాడు.

మంటలను కిటికీల్లోంచి చూసిన అందులోని ప్రయాణికులు చూసి భయబ్రాంతులకు గురయ్యారు. అయితే పైలట్‌ అప్రమత్తతో ప్రయాణికులు, అందులోని సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. కాగా, ఈ ఘటనపై సమగ్ర విచారణకు కేంద్ర పౌరవిమానయాన శాఖ ఆదేశించింది. వీలైనంత తొందరగా నివేదిక సమర్పించాలని డీజీసీఏ అధికారులకు స్పష్టం చేసింది.

Updated On 29 Oct 2022 4:03 AM GMT
Somu

Somu

Next Story