Indrakeeladri Dasara Celebrations | బెజవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల అంటే అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు దసరా శరన్నవరాత్రి వేడుకలు నిర్వహించాలని వైదిక కమిటీ సభ్యులు నిర్ణయించారు. 15న ఉదయం అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వహించి, బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు. అనంతరం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు. శరన్నవరాత్రి వేడుకల్లో మిగతా రోజుల్లో ఉదయం 4 నుంచి రాత్రి 10గంటల […]

Indrakeeladri Dasara Celebrations |

బెజవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల అంటే అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు దసరా శరన్నవరాత్రి వేడుకలు నిర్వహించాలని వైదిక కమిటీ సభ్యులు నిర్ణయించారు. 15న ఉదయం అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వహించి, బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు.

అనంతరం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు. శరన్నవరాత్రి వేడుకల్లో మిగతా రోజుల్లో ఉదయం 4 నుంచి రాత్రి 10గంటల వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.

20న మూలానక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి దర్శనానికి వేకువజామున 2 నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు దుర్గమ్మ దర్శన భాగ్యం కల్పించనున్నారు. దసరా వేడుకల్లో భాగంగా తొలిరోజు స్వర్ణకవచాలాంకృత దుర్గాదేవిగా దర్శనమిచ్చే అమ్మవారు..

ఈ సారి మాత్రం బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమివ్వనున్నారని వైదిక కమిటీ సభ్యులు పేర్కొన్నారు. 23న విజయదశమి సందర్భంగా ఉదయం 10.30 గంటలకు యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం, సాయంత్రం గంగా పార్వతీ సమేత దుర్గామల్లేశ్వరస్వామి వారల ఉత్సవమూర్తుల తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

అమ్మ వారి అలంకరణలు ఇవే..

అక్టోబర్‌ 15న తొలిరోజు దుర్గమ్మ బాలా త్రిపురసుందరీదేవి దర్శనం ఇవ్వనున్నది. రెండో రోజు 16న గాయత్రీదేవి, 17న అన్నపూర్ణాదేవి, 18న మహాలక్ష్మీదేవి, 19న లలితా త్రిపురసుందరీదేవి, 20న సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు కటాక్షించనున్నారు.

21న దుర్గాదేవి, 22న మహిషాసురమర్దిని 23న రాజరాజేశ్వరీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని వైదిక కమిటీ వివరించింది. అమ్మవారి మూలానక్షత్రం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని కమిటీ వివరించింది.

Updated On 4 Sep 2023 2:49 AM GMT
cm

cm

Next Story