waltair veerayya టాలీవుడ్‌ మౌనం.. దేనికి సంకేతం? ఇప్పటివరకు స్పందించని హీరోలు, దర్శకులు విధాత: తన మెగా క్యాంపు హీరోలే కాదు ఇతర చిన్న చిన్న హీరోలు కూడా మంచి విజయాలను సాధిస్తే వారిని అభినందించి ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ముందుంటారు. ఓ చిత్రం బాగుంది.. మంచి కంటెంట్ ఉంది.. హీరో బాగా చేశాడనే టాక్ వస్తే చాలు ఆయన సోషల్ మీడియా ద్వారానే కాదు.. ఆయా హీరోలను పిలిపించుకొని మరి అభినందిస్తారు. కాగా ప్రస్తుతం మెగాస్టార్ […]

waltair veerayya

  • టాలీవుడ్‌ మౌనం.. దేనికి సంకేతం?
  • ఇప్పటివరకు స్పందించని హీరోలు, దర్శకులు

విధాత: తన మెగా క్యాంపు హీరోలే కాదు ఇతర చిన్న చిన్న హీరోలు కూడా మంచి విజయాలను సాధిస్తే వారిని అభినందించి ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ముందుంటారు. ఓ చిత్రం బాగుంది.. మంచి కంటెంట్ ఉంది.. హీరో బాగా చేశాడనే టాక్ వస్తే చాలు ఆయన సోషల్ మీడియా ద్వారానే కాదు.. ఆయా హీరోలను పిలిపించుకొని మరి అభినందిస్తారు.

కాగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీ ఇండస్ట్రీ హిట్‌ దిశగా వెళుతోంది. ఇటీవల ఆచార్య, గాడ్‌ఫాదర్ చిత్రాలతో డీలా పడిన మెగాస్టార్ చిరంజీవికి, ఆయన అభిమానులకు ఈ చిత్రం మంచి కిక్ నిచ్చింది. దీంతో మెగా అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు. మెగాస్టార్ సైతం ఎంతో రిలాక్స్ మూడ్‌లో ఉన్నారు.

ఈ సినిమాకి కావాలని బ్యాడ్ టాక్ తెచ్చి దాన్ని ప్రచారం చేసేందుకు కూడా పలువులు ప్రయత్నించినా కానీ వారి పప్పులు ఉడకలేదు. సినిమాలో దమ్ముంటే దాన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదని చిరు నిరూపించాడు. 67 ఏళ్ల వయసులో చిరు చూపించిన ఎనర్జీ లెవల్స్ ఎంత పొగిడినా తక్కువే. మాస్ మసాలా చిత్రమైనప్పటికీ తనదైన ఎంటర్‌టైన్‌మెంట్‌తో, పాటలతో, యాక్షన్ సీన్స్‌తో ఆయన అభిమానులను కట్టి పడేశాడు.

కేవలం మాస్ ఆడియన్స్‌కు మాత్రమే రీచ్ అవుతుందని భావించిన సినీ విశ్లేషకులు సైతం ఈ చిత్రం సాధిస్తున్న విజయం, వసూళ్ల‌ను కొల్లగొడుతున్న విధానం చూసి నోరేళ్ల పెడుతున్నారు. ఈ వయసులో కూడా చెక్కుచెదరని స్టార్ ఇమేజ్‌ని మెయింటైన్ చేస్తున్న ఏకైక ఇండియన్ హీరో మెగాస్టార్ చిరంజీవి మాత్రమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

అయితే చిరంజీవి ఇంత పెద్ద సక్సెస్ సాధించినా కూడా టాలీవుడ్ సెలబ్రిటీస్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు ఒక్క ట్వీట్ గానీ, పోస్టు గానీ కనపడకపోవడం బాధాకరం. ప్రతి చిత్రానికి రివ్యూ ఇచ్చే సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎవరు ఈ చిత్రాన్ని అభినందించిన దాఖలాలు లేవు. చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి పెద్ద ఆర్టిస్టుల వరకు ఈ చిత్రం విషయంలో కాస్త విరుద్ధంగా బిహేవ్ చేస్తున్నారు.

మెగాస్టార్ చిత్రానికి వారు శుభాకాంక్షలు తెల‌ప‌డం లేదు. ఇది దేనికి సంకేతం అనేలా కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. ఒక్క సెలబ్రిటీ కూడా ఆయన విజయాన్ని పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది అంటూ మెగా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారా లేదా సహజంగానే శుభాకాంక్షలు తెలియ జేయడం లేదా అని టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరినీ ట్యాగ్ చేసి మరి మెగా అభిమానులు అడుగుతున్నారు.

Updated On 25 Jan 2023 1:30 PM GMT
krs

krs

Next Story