Inland Taipan ప్రపంచ వ్యాప్తంగా విషపూరిత పాములు ఉన్నాయి. ఈ భూమ్మీద విషపూరితమైన పాములు 600 జాతులు ఉన్నాయి. ఇందులో కేవలం 200 జాతులకు చెందిన పాములు అత్యంత విషపూరితమైనవి. ఈ పాములు కాటేస్తే మనుషులు ప్రాణాలు కోల్పోవడం ఖాయం.
అయితే ఆస్ట్రేలియాలో కనిపించే ఇన్‌ల్యాండ్ తైపాన్ పాము ప్రపంచంలో కెల్లా అత్యంత విషపూరితమైన పాము అని ఆస్ట్రేలియా మ్యూజియం ప్రకటించింది. ప్రపంచంలో అత్యంత విషపూరితమైన ఇన్‌ల్యాండ్ తైపాన్ను ఫియర్స్ స్నేక్ అని కూడా పిలుస్తారు.
దీని దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. పొద్దుపొద్దున్నే తైపాన్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ పాము ఎక్కువగా రాళ్లు ఉన్న ప్రాంతాల్లో దాచుకుంటుంది. ఉదయం పూట చురుకుగా ఉండే ఈ పాము మిగతా సమయాల్లో రెస్ట్‌లో ఉంటుంది.
— vidhaathanews (@vidhaathanews) December 13, 2022
తైపాన్ విషం డేంజరస్..
ఈ పాముల విషాన్ని ఎల్డీ50 స్కేల్ రూపంలో కొలుస్తారు. అయితే ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన తైపాన్ పాము.. విషం చాలా డేంజరస్ అని స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ, యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ వెబ్సైట్లో పేర్కొంది. తైపాన్ ఒకసారి కాటేస్తే 110 మిల్లీగ్రాముల విషం విసర్జితం అవుతుందని తెలిపింది.
ఈ పాము ఒక్కసారి కాటేస్తే 100 మంది చనిపోయే ఆస్కారం ఉంటుంది. ఎలుకలు అయితే ఒకేసారి 2,50,000 చనిపోయే అవకాశం ఉంది. ఇంతటి విషపూరితమైన పాము.. ఆస్ట్రేలియాలో తప్ప మిగతా ప్రాంతాల్లో ఎక్కడ కనిపించలేదని స్పష్టం చేసింది.
— vidhaathanews (@vidhaathanews) December 13, 2022
యాక్టివాలోకి దూరిన నాగుపాము.. ఈ వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే..
ఫ్రిజ్‌లోకి దూరిన నాగుపాము.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే..
[…] Inland Taipan | ఈ పాము కాటేస్తే ఒకేసారి 100 మంది బ… […]